చేనేత సమస్యల పరిష్కారం కోసం కృషి
ABN, Publish Date - Apr 26 , 2025 | 12:26 AM
చేనేత సమస్యల పరిష్కారంకోసం కృషి చే స్తానని చేనేత, జౌళీశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. ‘చేనేత రంగం సమస్యల’పై మే 1వ తేదీన భూదాన్‌పోచంపల్లిలో నిర్వహించనున్న సదస్సుకు ముఖ్యఅతిథిగా మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావును ఆహ్వానిస్తూ శుక్రవారం భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర చేనేత నాయకులు తడక వెంకటేష్ ఆహ్వానించారు.
చేనేత, జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు
భూదాన్‌పోచంపల్లి చేనేత సదస్సుకు మంత్రిని ఆహ్వానించిన ఎంపీ, ఎమ్మెల్యే
భూదాన్‌పోచంపల్లి,ఏప్రిల్25(ఆంధ్రజ్యోతి): చేనేత సమస్యల పరిష్కారంకోసం కృషి చే స్తానని చేనేత, జౌళీశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. ‘చేనేత రంగం సమస్యల’పై మే 1వ తేదీన భూదాన్‌పోచంపల్లిలో నిర్వహించనున్న సదస్సుకు ముఖ్యఅతిథిగా మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావును ఆహ్వానిస్తూ శుక్రవారం భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర చేనేత నాయకులు తడక వెంకటేష్ ఆహ్వానించారు. ఈమేరకు అదేరోజున భూదాన్‌పోచంపల్లి పట్టణంలోని ‘ది పోచంపల్లి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు’ నూతన భవనం ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తూ బ్యాంకు చైర్మన్ తడక రమేష్ ఆహ్వాన పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్ పాలనలో తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయిన చేనేతరంగాన్ని పరిరక్షించి, చేనేతల సంక్షేమానికి కాంగ్రెస్ కృషి చేస్తోందన్నారు. చేనేత కార్మికుల సంక్షేమం లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. కార్యక్రమం లో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు భారత లవకుమార్, నాయకులు కొట్టం కరుణాకర్‌రెడ్డి, అర్బన్ బ్యాంక్ చైర్మన్ తడక రమేష్, వైస్‌చైర్మన్ భారత రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.
Updated Date - Apr 26 , 2025 | 12:26 AM