బసవేశ్వర ఆశయ సాధనకు కృషి చేయాలి
ABN, Publish Date - May 01 , 2025 | 01:07 AM
కుల,మత రహిత సమాజ స్థాపనకు కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త బసవేశ్వరుడ ని, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన బసవేశ్వర జయంతి లో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
కలెక్టర్ ఎం.హనుమంతరావు
భువనగిరి (కలెక్టరేట్), ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): కుల,మత రహిత సమాజ స్థాపనకు కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త బసవేశ్వరుడ ని, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన బసవేశ్వర జయంతి లో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజలకు సమాజంపై అవగాహ న కల్పించిన మొదటి వ్యక్తి బసవేశ్వరుడని అన్నారు. ఆయన జీవిత చరిత్రను ఈ తరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమం లో బీసీ సంక్షేమాధికారి యాదయ్య, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్ పాల్గొన్నారు.
అంగన్‌వాడీల్లోనే పూర్వ ప్రాథమిక విద్య
అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య అందుతుందని, అందుకు సిబ్బంది బాధ్యతాయుతంగా పని చేయాలని కలెక్టర్ ఎం. హనుమంతరావు అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మా ట్లాడారు. నిరుపేదల పిల్లల సంక్షేమానికి ప్రభు త్వం అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసి లక్షలాది రూపాయలు వెచ్చిస్తోందన్నారు. బాల్యం లో చిన్నారులకు సమతుల ఆహారాన్ని అందించి, పూర్వప్రాథమిక విద్యను ప్రోత్సహిస్తోందన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేసేందుకు బడిబాటలా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి చిన్నారుల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం ఉద్యోగ విరమణ చేసిన ఐసీడీఎస్ ఉద్యోగులు కే.రమ, డీ.ఊర్మిళను కలెక్టర్ సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి కొండాపురం నర్సింహారావు, సూపరింటెండెంట్ శశికళ, యశోద, తదితరులు పాల్గొన్నారు.
మాట నిలబెట్టుకున్నావ్..
ఇంటికొచ్చి సన్మానిస్తా
కలెక్టర్ దత్తత తీసుకున్న విద్యార్థికి ‘పది’ ఫలితాల్లో 73శాతం మార్కులు
ఫోన్ చేసి అభినందించిన కలెక్టర్ హనుమంతరావు
సంస్థాన్ నారాయణపురం, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావ్.. మీ ఇంటికొచ్చి సన్మానం చేస్తా అని జిల్లా కలెక్టర్ హనుమంతరావు పదో తరగతి విద్యార్థికి ఫోన్‌చేసి అభినందించారు. తెల్లవారుజామునే పదో తరగతి విద్యార్థుల ఇంటి తలుపు తట్టే వినూత్న కార్యక్రమంలో భాగంగా నారాయణపూర్ మండలంలోని శేరిగూడెం గ్రామానికి చెందిన భరత్‌చంద్రచారి అనే విద్యార్థిని కలెక్టర్ గతంలో దత్తత తీసుకున్నారు. బుధవారం వెల్లడించిన ఫలితాల్లో భరత్‌చంద్రచారి 73శాతం మార్కులతో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణ త సాధించాడు. దీంతో అతడికి కలెక్టర్ ఫోన్‌చేసి అభినందనలు తెలిపారు. పతో తరగతి విద్యార్థికి మైలురాయి లాంటిదని, భరత్ విజయ సాధనలో పాలుపంచుకున్న ఆమె తల్లి విజయలక్ష్మిని కలెక్టర్ అభినందించారు.
Updated Date - May 01 , 2025 | 01:07 AM