పుట్టిన గ్రామాన్ని, పాఠశాలను మరవద్దు
ABN, Publish Date - Apr 24 , 2025 | 12:13 AM
మోతె, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి) : పుట్టిన గ్రామాన్ని, చదువుకున్న పాఠశాలను మరవవద్దని సూర్యాపేట జిల్లా మోతె ఎంఈవో గోపాల్‌రావు అన్నారు.
తండ్రి చదువుకున్న పాఠశాలకు ఎన్నారై దాతృత్వం
రూ.18 లక్షలతో తరగతి గదుల నిర్మాణం
మోతె, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి) : పుట్టిన గ్రామాన్ని, చదువుకున్న పాఠశాలను మరవవద్దని సూర్యాపేట జిల్లా మోతె ఎంఈవో గోపాల్‌రావు అన్నారు. మండలంలోని నామవరం గ్రామానికి చెందిన ఎన్నారై కంచర్ల ఉపేందర్‌నాయుడు తండ్రి రామక్రిష్ణయ్య చదువుకున్న పాఠశాలలో ఆయన జ్ఞాపకార్థం రూ.18 లక్షలతో రెండు తరగతి గదులను నిర్మించారు. బుధవారం ఆయా తరగతి గదులను ఎంఈవో ప్రారంభించి, మాట్లాడారు. అంతకుముందు విద్యార్థులు కోలాటాలతో ఉపేందర్‌నాయుడుకు, అధికారులకు స్వాగతం పలికారు. తరగతి గదుల వివరాలు,పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న సైన్స ల్యాబ్‌ను, ఆవరణను ఉపాధ్యాయులు వివరించారు. ఈ సందర్భంగా ఎన్నారై కంచర్ల ఉపేందర్‌నాయుడు మాట్లాడారు. ప్రతి ఒక్కరూ పుట్టిన ఊరును, చదువుకున్న పాఠశాలను, గ్రామస్థులను మరువవద్దని, తాము ఎక్కడ ఉన్నా తమ పూర్వీకుల గ్రామం గొప్పగా ఉండాలనే ఆలోచనతో తమవంతుగా సహకారాలు అందించాలన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు. పాఠశాలలోని సమస్యల పరిష్కారానికి తమవంతుగా కృషి చేస్తామన్నారు. ఉపాధ్యాయులు, గ్రామస్థులు ఉపేందర్‌నాయుడిని శాలువాలు, మెమోంటోతో సన్మానించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు బీఎల్‌ఎనచారి, ఉపాధ్యాయులు కొత్తపల్లి రాంరెడ్డి, సుధీర్, సురేష్, మల్లయ్య, కోటేష్, మురళీ, మహిళా ఉపాధ్యాయులు, చిట్యాల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Apr 24 , 2025 | 12:13 AM