ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కొనుగోళ్లలో నిర్లక్ష్యం తగదు

ABN, Publish Date - May 18 , 2025 | 12:12 AM

వలిగొండ మండలంలోని వెల్వర్తి గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రా ల్లో అధికారులు, సంబంధింత సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపించారు. ఈ మేరకు మండలకేంద్రంలో ప్రధాన రహదారి పై రైతులు ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు.

వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల రాస్తారోకో

వలిగొండ, మే 17 (ఆంధ్రజ్యోతి): వలిగొండ మండలంలోని వెల్వర్తి గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రా ల్లో అధికారులు, సంబంధింత సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపించారు. ఈ మేరకు మండలకేంద్రంలో ప్రధాన రహదారి పై రైతులు ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో తాము ఇబ్బందులు పడుతున్నామన్నారు. అధికారులు, హమాలీల నిర్లక్ష్యం, లారీల కొరతతో తాము నష్టపోతున్నామన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారమే తేమ శాతం ఉన్నా, సకాలంలో కొనుగోలు చేయడంలేదన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అధికారులతో మాట్లాడి, సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకోను విరమించారు. కార్యక్రమంలో రైతులు చంద్రయ్య, శ్రీను, బాలశౌరి, రోమన్‌, జోగయ్య తదితరులు పాల్గొన్నారు.

ప్రతీ ధాన్యం గింజను కొనుగోలు చేస్తాం

ప్రతీ ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని రైతులు అధైర్యపడవద్దని సివిల్‌ సప్లయ్‌ అధికారి రోజా తెలిపారు. శనివారం మండలంలోని వెల్వర్తి గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాడ్లాడుతూ, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. లారీల కొరతతో కొంత ఆలస్యం జరుగుతుందన్నారు. ధాన్యం రాశులపై టార్పాలిన్లు కప్పుకోవాలన్నారు. ఽధాన్యం కోనుగోలు వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అధికారులు బాలమణి, నాగేష్‌, సునీల్‌రెడ్డి, ఏఈవో సాయి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 18 , 2025 | 12:12 AM