ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నిరుపయోగంగా దొండ మార్కెట్‌

ABN, Publish Date - May 12 , 2025 | 12:33 AM

దేవరకొండ, మే 10(ఆంధ్రజ్యోతి): వరికి భిన్నంగా వాణిజ్యపంటల సాగుపై దృష్టి సారిస్తున్నారు దేవరకొండ డివిజన పరిధిలోని రైతులు. గతేడాది డివిజన పరిధిలోని 2.12 లక్షల ఎకరాల్లో వేరుశనగ, దొండ, మిరప, ము నగ, ఆకుకూరలు, టమాట, ఇతర వాణిజ్య పంటలు సాగు చేస్తున్నప్పటికీ గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

- దళారీల చేతిలో మోసపోతున్న రైతులు

- దేవరకొండలో మార్కెట్‌లేక రైతుల ఇబ్బందులు

దేవరకొండ, మే 10(ఆంధ్రజ్యోతి): వరికి భిన్నంగా వాణిజ్యపంటల సాగుపై దృష్టి సారిస్తున్నారు దేవరకొండ డివిజన పరిధిలోని రైతులు. గతేడాది డివిజన పరిధిలోని 2.12 లక్షల ఎకరాల్లో వేరుశనగ, దొండ, మిరప, ము నగ, ఆకుకూరలు, టమాట, ఇతర వాణిజ్య పంటలు సాగు చేస్తున్నప్పటికీ గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

కొన్నేళ్లుగా ఏఎమ్మార్పీ ఆయకట్టు కింద పూర్తి స్థాయిలో సాగునీరు విడుదల చేయకపోవడంతో రైతులు ఆరుతడి పంటలైన దొండ, మునగ, ఇతర కూరగాయల సాగుపై దృష్టి సారించారు. పీఏపల్లి, గుర్రంపోడు మండలాలలోని 15వేల ఎకరాలకుపైగా దొండ, మునగ పంటలను రైతులు సాగు చేశారు. పీఏపల్లి మండలం అక్కంపల్లి, రంగారెడ్డిగూడెం, కోనమేకలవారిగూడెం, అంగడిపేట, మల్లాపురం గ్రామాల్లో 9 నుంచి 10వేల ఎకరా లకు పైగా రైతులు దొండ సాగు చేశారు. కానీ దొండకు మార్కెట్‌ సౌకర్యం లేకపోవడంతో దళారీలు చెప్పిన రేటుకే విక్రయించే పరిస్థితి. పీఏపల్లి మండలం కోనమేకలవారిగూడెం వద్ద అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2016 లో దొండ మార్కెట్‌ను రూ.60 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసింది. ఆ మార్కెట్‌లో సౌకర్యం కల్పించక పోవడం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా దొండ మార్కెట్‌ నిరుపయోగంగా మారింది. దీన్ని ఆసరాగా చేసుకొని వ్యాపారు లు నేరుగా రైతుల వద్దకే వచ్చి దొండ పంటను తాము చెప్పిన రేటుకే కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. ఎకరాకు రూ.2.5 లక్షల ఖర్చుతో దొండ పంటను రైతులు సాగు చేస్తున్నారు. ఉద్యానవనశాఖ 60శాతం సబ్సిడీ ఇస్తుందని రైతులు తెలుపుతున్నారు. 60 రోజుల నుంచి దొండ పంట దిగుబడి అవుతుంది. ప్రస్తుతం దొండ కా య 50 కిలోల బస్తాకు మార్కెట్‌లో రూ.400 నుంచి 600 వరకు ధర పలుకుతోంది. హైదరాబాద్‌, గుంటూరు, వరంగల్‌, మాచర్ల, బోయినపల్లి నుంచి వ్యాపారులు వాహనాల్లో దొండ తోటల వద్దకు వచ్చి వారు నిర్ణయించిన ధరకే రైతుల నుంచి దొండ కాయలు కొనుగోలు చేస్తున్నారు. విధిలేని పరిస్థితిలో వ్యాపారులు చెప్పిన రేటుకే దొండ పంటలను విక్రయించాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. మార్కెట్‌ ఉన్న నిరుపయోగంగా ఉందని, అధి కారులకు తెలిపిన పట్టించుకోవడంలేదని రైతులు తెలుపుతున్నారు.

ఏఏ పంటలు ఎంత సాగు అంటే..

గతేడాది 1.70 లక్షల ఎకరాల్లో పత్తి సాగుచేయగా 15 వేల ఎకరాల్లో వేరుశనగ, 25 వేల ఎకరాల్లో వరి, ఇతర పంటలను సాగు చేశారు. ఈ ఏడాది డివిజన పరిధిలో 2వేల ఎకరాల వరకు మిరప సాగు చేశారు. 15 వేల ఎకరాల వరకు వేరుశనగ సాగు చేశారు. రైతులు అధికంగా దొండ, వేరుశనగ, మిరప, మునగ, ఇతర పంటలపై దృష్టి సారిస్తున్నారు. వ్యవసాయశాఖ అధికారుల సల హాలు, సూచనలు తీసుకొని బోరు బావులు, నీటివనరులు ఉన్న రైతులు అధికంగా కూరగాయలు సాగు చేస్తున్నారు.

గిట్టుబాటు ధర కల్పించాలి :

దొండ రైతులకు మార్కెట్‌ సౌకర్యం ఏర్పాటు చేసి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. మూడు ఎకరాల్లో రూ. 3 లక్షలకుపైగా పెట్టుబడులు పెట్టి దొండ సాగు చేశా. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, వ్యాపారులు చెప్పిన రేటుకే విక్రయించే పరిస్థితి. గిట్టుబాటు ధర కల్పించాలి.

వంగాల గోవర్ధనరెడ్డి, అంగడిపేట, పీఏపల్లి మండలం

దొండ మార్కెట్‌ ఏర్పాటు చేయాలి:

పీఏపల్లిలో రూ.60లక్షలతో దొండ మార్కెట్‌ నిర్మించినప్పటికీ పర్యవేక్షణ లేక నిరుపయోగంగా ఉంది. దొండ రైతులు వ్యాపారులు చెప్పిన రేటుకే విక్రయిస్తు నష్టపోతున్నారు.

దేప సుదర్శనరెడ్డి, వ్యవసాయ కార్మికసంఘం నాయకుడు, దేవరకొండ

సమస్య పరిష్కరించేందుకు కృషి :

పీఏపల్లిలో దొండ మార్కెట్‌ను వినియోగంలోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నా. ఈ విషయమై జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తా.

-దేవరకొండ ఆర్డీవో రమణారెడ్డి

Updated Date - May 12 , 2025 | 12:33 AM