ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రేషన కార్డుల పంపిణీ చరిత్రలో నిలుస్తుంది

ABN, Publish Date - Jul 04 , 2025 | 12:16 AM

తిరుమలగిరిలో ఈ నెల 14న సీఎం రేవంతరెడ్డి కొత్త రేషనకార్డుల పంపిణీ ప్రారంభించడం రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందని ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు.

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు

మోత్కూరు, జూలై 3 (ఆంధ్రజ్యోతి): తిరుమలగిరిలో ఈ నెల 14న సీఎం రేవంతరెడ్డి కొత్త రేషనకార్డుల పంపిణీ ప్రారంభించడం రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందని ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. గురువారం మోత్కూరు మండల కేంద్రంలోని ఓ ఫంక్షన హాల్‌లో నిర్వహించిన కాంగ్రెస్‌ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఒక్క కొత్త రేషన కార్డు ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 మాసాల్లోనే అర్హులైన పేదలందరికీ రేషన కార్డులు ఇస్తోందన్నారు. సీఎం తుంగతుర్తి నియోజకవర్గంలో రేషనకార్డుల పంపిణీ ప్రారంభించనుండటం నియోజకవర్గ ప్రజలకే గర్వకారణమన్నారు. గత ప్రభుత్వం అప్పులు నెత్తిన పెట్టిపోతే కాంగ్రెస్‌ ప్రభుత్వం మొదట కొంత ఇబ్బంది పడిందన్నారు. ప్రభుత్వం ఇప్పుడు గాడిన పడిందని, ఇక సంక్షేమ పథకాలన్నీ అమలు జరుగుతాయన్నారు. తనకు ఎవరిపైనా వ్యక్తిగత కోపం లేదని, పార్టీ, ప్రభుత్వం కోసం అందరూ కలిసిపనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. రానున్న అసెంబ్లీ నియోజకవర్గాల డీలిమిటేషనలో మోత్కూరు నియోజకవర్గమవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన రేషన కార్డుల పంపిణీని నియోజకవర్గంలో ప్రారంభిస్తున్నందున అన్ని వర్గాల ప్రజలు అధికసంఖ్యలో పాల్గొని సీఎం సభను విజయవంతం చేయాలని కోరారు. సింగిల్‌విండో చైర్మన పేలపూడి వెంకటేశ్వర్లు, మార్కెట్‌ చైర్‌ పర్సన నూనెముంతల విమలవెంకటేశ్వర్లు, కాంగ్రెస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు పైళ్ల సోమిరెడ్డి, మండల, పట్టణ అధ్యక్షులు వంగాల సత్యనారాయణ, గుండగోని రామచంద్రు, ఏపీఐడీసీ మాజీ డైరెక్టర్‌ కంచర్ల యాదగిరిరెడ్డి, మార్కెట్‌ డైరెక్టర్లు పన్నాల శ్రీనివా్‌సరెడ్డి, ఎండి.సమీర్‌, పోచం జగన, నాయకులు డాక్టర్‌ గుర్రం లక్ష్మీనర్సింహారెడ్డి, అవిశెట్టి అవిలిమల్లు, చింతల విజయభాస్కర్‌రెడ్డి, అన్నెపు పద్మ, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఇటీవల బండరాయి మీద పడి మృతి చెందిన నాగుల్‌ మీరా ఇంటికి వెళ్లి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆర్ధిక సహాయం అందించారు. కాశవాడలో ఇంటిలోపల ప్రమాదకరంగా ఉన్న విద్యుత స్తంభాన్ని ఆయన పరిశీలించి ఆగ్రహం వ్యక్తం వ్యక్తం చేశారు. ఆ స్తంభాన్ని తొలగించి వేరే చోట నాటడానికి తన నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి డబ్బులు ఇస్తానని లేక ఇచ్చినా స్తంభం తొలగించక పోవడమేమిటని ఆయన ప్రశ్నించారు. ఎస్‌ఈ దృష్టికి తీసుకువెళతానన్నారు.

Updated Date - Jul 04 , 2025 | 12:16 AM