ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అక్కడక్కడ అసంతృప్తి

ABN, Publish Date - Jul 03 , 2025 | 12:27 AM

:కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి వచ్చి ఒకటిన్నర సంవత్సరం గడిచింది. కొన్ని నియోజకవర్గాల్లో వర్గ విభేదాలు భగ్గుమంటూనే ఉన్నాయి. నాయకుల మధ్య ఐక్యత కొరవడింది.

సమన్వయంతో కాంగ్రెస్‌ ముందుకు

హుజూర్‌నగర్‌లో బీఆర్‌ఎ్‌సకు నాయకత్వ లోపం

సంస్థాగతంగా బలపడని బీజేపీ

(ఆంద్రజ్యోతి-సూర్యాపేట) :కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి వచ్చి ఒకటిన్నర సంవత్సరం గడిచింది. కొన్ని నియోజకవర్గాల్లో వర్గ విభేదాలు భగ్గుమంటూనే ఉన్నాయి. నాయకుల మధ్య ఐక్యత కొరవడింది. హుజూర్‌నగర్‌కు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఆయన సతీమణి ఉత్తమ్‌పద్మావతిరెడ్డి కోదాడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో ఎటువంటి వర్గ పోరు లేదు. అభివృద్ధి పథకాలను మంజూరు చేసి అధికారులతో నిత్యం సమీక్షలు చేసి పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా రోడ్లు, నాగార్జునసాగర్‌ ఎడమకాల్వపై లిఫ్ట్‌ల నిర్మాణం, పాఠశాల, కళాశాలల మంజూరు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పథకాలు రచిస్తున్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన పటేల్‌ రమే్‌షరెడ్డి వర్గాల మధ్య సఖ్యత లేదు. ఎవరికి వారే యమునాతీరే అన్నట్లుగా ఉన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో కాంగ్రెస్‌ కార్యకర్తలను ఆదుకోవడానికి ఏఐసీసీ కార్యదర్శి రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన కొప్పుల వేణారెడ్డి కృషి చేస్తున్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు చనిపోతే ఆ కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నారు. తాము అండగా ఉంటామని తెలియజేస్తున్నారు. పటేల్‌ రమే్‌షరెడ్డి వర్గానికి చెందిన వారు చనిపోతే ఆయన అక్కడికి వెళ్లి సానుభూతి తెలియజేయడంతో పాటు ఆదుకుంటామని హామీ ఇస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రెండు వర్గాల నాయకులు కలిసి కార్యక్రమాలు నిర్వహించలేదు. తుంగతుర్తిలో ఎమ్మెల్యే మందుల సామేల్‌ బీఆర్‌ఎస్‌ నాయకులకు ప్రాధాన్యం ఇచ్చి కాంగ్రెస్‌ నాయకులను మరిచిపోతున్నారని కొంతమంది పాత కాంగ్రెస్‌ నాయకులు గుర్రుగా ఉన్నారు. కాంగ్రెస్‌ నాయకులను సమన్వయం చేయడానికి మే నెలలో రాష్ట్ర పరిశీలకులు అర్వపల్లికి వచ్చారు. అప్పుడు కూడా కాంగ్రె్‌సలోని రెండువర్గాల నాయకులు ఘర్షణ పడ్డారు. అందరినీ సమన్వయం చేయడానికి ఎమ్మెల్యే సామెల్‌ ప్రయత్నిస్తున్నారు.

బీఆర్‌ఎ్‌సలో...

హుజూర్‌నగర్‌ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి గత పార్లమెంట్‌ ఎన్నికల ముందు బీజేపీలో చేరి నల్లగొండ పార్లమెం ట్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వా త హుజూర్‌నగర్‌ నియోజకవర్గ ఇనచార్జిని నియమించలేదు. నియోజకవర్గ సమన్వయకర్త గా మాజీ ఉన్నతవిద్యా మండలి సభ్యుడు ఒంటెద్దు నర్సింహారెడ్డిని నియమించారు. ఆయ న వీలైనప్పుడల్లా సమావేశాలు నిర్వహిస్తున్నారు. కార్యకర్తలను పట్టించుకునే వారు కరువయ్యారని ఆ పార్టీ నాయకులే పేర్కొంటున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలోపు నియోజకవర్గ ఇనచార్జిని నియమించకుంటే పార్టీకి నష్టం జరిగే అవకాశముందని సీనియర్‌ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఉద్యమకారుల నుంచి పాత, కొత్తతరం నాయకుల్లో అనేక మంది నియోజకవర్గ ఇనచార్జి పదవిని ఆశిస్తున్నారు. సూర్యాపేట ఎమ్మెల్యే జగదీ్‌షరెడ్డి నియోజకవర్గంలో ఉన్న బీఆర్‌ఎస్‌ నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కోదా డ, తుంగతుర్తిలో మాజీ ఎమ్మెల్యేలు ..బొల్లం మల్లయ్యయాదవ్‌, గాదరి కిశోర్‌ ఇనచార్జిలుగా వ్యవహరిస్తు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో ఎటువంటి అసమ్మతి వాదులు లేరు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కోదాడ నియోజకవర్గంలోని బీఆర్‌ఎస్‌ నాయకులు కాంగ్రె్‌సలో చేరారు.

బీజేపీలో..

నాలుగు నియోజకవర్గాల్లో సూర్యాపేటలో మాత్రమే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు నాయకత్వంలో పార్టీ బలంగానే ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 40వేలకు పైగా ఓట్లు సాదించారు. మిగిలిన నియోజకవర్గాల్లో ఆ పార్టీకి పెద్దగా ఓట్లు పడలేదు. కోదాడ, హుజూర్‌నగర్‌, తుగతుర్తి నియోజకవర్గాల్లోని అన్ని గ్రామాల్లో ఆ పార్టీ బలోపేతం చేయాల్సి ఉంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాత్రం కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సలనే ఆదరిస్తున్నారు.

Updated Date - Jul 03 , 2025 | 12:27 AM