ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఎమ్మెల్యే నిర్లక్ష్యంతోనే పనుల్లో జాప్యం

ABN, Publish Date - Jun 23 , 2025 | 12:00 AM

చౌటుప్పల్‌ పట్టణంలోని 65వ నెంబర్‌ జాతీయ రహదారిపై ఫ్లైఓవర్‌, సర్వీస్‌ రోడ్ల నిర్మాణంలో జరుగుతున్న జాప్యానికి స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి నిర్లక్ష్యమే కారణమని బీజేపీ మునుగోడు అసెంబ్లీ కన్వీనర్‌ దూడల భిక్షంగౌడ్‌ ఆరోపించారు.

బీజేపీ అసెంబ్లీ కన్వీనర్‌ దూడల భిక్షంగౌడ్‌

చౌటుప్పల్‌ టౌన్‌, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): చౌటుప్పల్‌ పట్టణంలోని 65వ నెంబర్‌ జాతీయ రహదారిపై ఫ్లైఓవర్‌, సర్వీస్‌ రోడ్ల నిర్మాణంలో జరుగుతున్న జాప్యానికి స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి నిర్లక్ష్యమే కారణమని బీజేపీ మునుగోడు అసెంబ్లీ కన్వీనర్‌ దూడల భిక్షంగౌడ్‌ ఆరోపించారు. పట్టణంలో అసంపూర్తిగా ఉన్న హైవే సర్వీ్‌సరోడ్లు, చెరువు అలుగు ప్రాంతం, అసంపూర్తిగా ఉన్న ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ భవన సముదాయాన్ని బీజేపీ పట్టణ అధ్యక్షురాలు కడారి కల్పన ఆధ్వర్యంలో ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా భిక్షంగౌడ్‌ మాట్లాడుతూ, పట్టణంలో ప్లై ఓవర్‌ను నిర్మించేందుకు ఏడాది క్రితం హైవే సర్వీస్‌ రోడ్ల పునర్నిర్మాణ పనులను మొదలు పెట్టి నేటికీ పూర్తి చేయక పోవడం విచారకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఫ్లైఓవర్‌ నిర్మాణానికి ఏడాది కిత్రం రూ.114కోట్లను మంజూరు చేసిందని, అయినా నేటికీ పనులను ప్రారంభించకపోవడం దురదుష్టకరమన్నారు. అసంపూర్తి రోడ్లతో చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. చెరువు అలుగునుంచి ప్రవహించే వరద నీరు దిగువకు వెళ్లేందుకు కాల్వ లేదని, అలుగు ను కూడా కొంతమంది కబ్జాచేసి అక్రమ నిర్మాణాలను చేపట్టారని ఆరోపించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రమనగోని శంకర్‌, నాయకులు కంచర్ల గోవర్థన్‌ రెడ్డి, పి.శ్రీధర్‌బాబు, ఉబ్బు భిక్షపతి, పబ్బు వంశీ, కడారి అయిలయ్య, వనం ధనుంజయ్య, గోశిక పురుషోత్తం, ఎ. ధశరథ, బడుగు కృష్ణ, బుడ్డ సురేష్‌, వి. నాగరాజు, పబ్బతి శేఖర్‌, కొండల్‌, సాయి పాల్గొన్నారు.

Updated Date - Jun 23 , 2025 | 12:00 AM