ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రేపటి నుంచి డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలు

ABN, Publish Date - May 13 , 2025 | 12:15 AM

భువనగిరి టౌన్‌, మే 12 (ఆంధ్రజ్యోతి) : కొన్ని నెలలుగా వాయిదా పడుతున్న డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలపై సందిగ్ధం వీడింది. డిగ్రీ పరీక్షల నిర్వహణ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల విడుదలపై ప్రైవేట్‌ యాజమాన్యాల డిమాండ్లను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ బాలకృష్ణారెడ్డి ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు.

భువనగిరి టౌన్‌, మే 12 (ఆంధ్రజ్యోతి) : కొన్ని నెలలుగా వాయిదా పడుతున్న డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలపై సందిగ్ధం వీడింది. డిగ్రీ పరీక్షల నిర్వహణ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల విడుదలపై ప్రైవేట్‌ యాజమాన్యాల డిమాండ్లను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ బాలకృష్ణారెడ్డి ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో బకాయిలు విడుదలకు సీఎం సుముఖత వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లో అసోసియేషన్‌ ప్రతినిధులతో జరిపిన చర్చలలో బకాయిల విడుదలకు సీఎం హామీ ఇచ్చినట్టు ఆయన తెలిపారు. దీంతో చర్చలు ముగిసిన వెంటనే సమ్మెను విరమిస్తున్నట్టు అసోసియేషన్‌ ప్రకటించింది. సమ్మె విరమణతో రెండు నెలలుగా వాయిదా పడుతున్న డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. థియరీ పరీక్షల అనంతరం ప్రాక్టికల్స్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. బకాయిల విడుదలకు హామీ ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డికి, ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు కృషి చేసిన ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ బాలకృష్ణరెడ్డికి అసోసియేషన్‌ కృతజ్ఞతలు తెలిపింది. విద్యార్థుల భవిష్యత్తు, బకాయిల విడుదలపై సీఎం, ఉన్నత విద్యా మండలి చైర్మన్‌పై విశ్వాసంతో సమ్మెను విరమించి షెడ్యూల్‌ ప్రకారం సెమిస్టర్‌ పరీక్షల నిర్వహణకు సహకరిస్తామని అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ బి సూర్యనారాయణరెడ్డి తెలిపారు. అసోసియేషన్‌ సమ్మె విరమణ నిర్ణయంతో సెమిస్టర్‌ పరీక్షల కోసం ఎదురుచూస్తున్న ఉమ్మడి జిల్లాలోని డిగ్రీ విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఊరట లభించినట్టయింది.

ఫ నల్లగొండ టౌన్‌ : ఈనెల 14 నుంచి సెమిస్టర్‌, బ్యాక్‌లా గ్‌ పరీక్షలను నిర్వహించనున్నట్లు ఎంజీయూ సీవోఈ డాక్టర్‌ ఉపేందర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు గతంలో పొందిన హాల్‌టికెట్లు లేదా కొత్తగా హాల్‌ టికెట్లు తీసుకొని గానీ ఈ పరీక్షలకు హాజరుకావచ్చు అని ఆయన పేర్కొన్నారు. డిగ్రీ ఆరవ సెమిస్టర్‌లో 8,487, నాలుగో సెమిస్టర్‌లో 8,660, రెండో సెమిస్టర్‌లో 10,408, ఒకటవ సెమిస్టర్‌లో 6,066, మూడో సెమిస్టర్‌లో 5,109, ఐదో సెమిస్టర్‌లో 4,171 మంది విద్యార్ధులు పరీక్ష రాయనున్నట్లు వివరించారు.

Updated Date - May 13 , 2025 | 12:15 AM