ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మూడు శాఖల పంతంతో తీరని ప్రజల దప్పిక

ABN, Publish Date - Jul 16 , 2025 | 12:28 AM

భువనగిరి పట్టణంలో తాగునీటి సరఫరాపై మూడు ప్రభుత్వ శాఖల తీరు మూడు ముక్కలాటగా మారింది. అసంపూర్తి పైపులైన్‌ పనులను పూర్తి చేయడంలో రెండు ప్రభుత్వశాఖలు, ప్రజలకు సరిపడా తాగునీటిని అందించడంలో మరో శాఖ ప్రదర్శిస్తున్న అలసత్వంతో ప్రజల గొంతెండుతోంది.

కోట్ల రూపాయల పనులు పూర్తయినా తప్పని ఇక్కట్లు

మునిసిపల్‌, ప్రజారోగ్య, మిషన్‌ భగీరథ శాఖల మధ్య కొరవడిన సమన్వయం

(ఆంధ్రజ్యోతి,భువనగిరి టౌన్‌) : భువనగిరి పట్టణంలో తాగునీటి సరఫరాపై మూడు ప్రభుత్వ శాఖల తీరు మూడు ముక్కలాటగా మారింది. అసంపూర్తి పైపులైన్‌ పనులను పూర్తి చేయడంలో రెండు ప్రభుత్వశాఖలు, ప్రజలకు సరిపడా తాగునీటిని అందించడంలో మరో శాఖ ప్రదర్శిస్తున్న అలసత్వంతో ప్రజల గొంతెండుతోంది. ఇప్పటికైనా సంబంధిత శాఖల అధికారులు స్పందించి పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

భువనగిరి పట్టణం వైశాల్యం సుమారు 32 చదరపు కిలోమీటర్లు ఉండగా, 35 వార్డుల్లో సుమారు 11వేల గృహాలు, 70వేల మంది ప్రజలు నివసిస్తున్నారు. వీరికి సుమారు 8,500 కుళాయిల ద్వారా నిత్యం 5.7ఎంఎల్‌డీ కృష్ణా జలాలు, 5ఎంఎల్‌డీ స్థానిక జలాలు మొత్తంగా 10.7ఎంఎల్‌డీ తాగునీటిని మునిసిపాలిటీ సరఫరా చేస్తోంది. అయితే పట్టణంలోని పలు ప్రాంతాల్లో పైపులైన్‌, వాటర్‌ ట్యాంకులు, నల్లా కనెక్షన్లు లేకపోవడంతో ప్రజలు తాగునీటి కొరతను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మిషర్‌ భగీరథ పథకంలో భాగంగా రూ.20కోట్లతో ఆరెళ్ల క్రితం పట్టణంలోని పలు ప్రాంతాలకు పైప్‌లైన్‌ ఏర్పాటు చేశారు. హుస్సేనాబాద్‌ ఇందిరమ్మ కాలనీలో 10లక్షల లీటర్ల సామర్థ్యంతో నీటి ట్యాంకును నిర్మించారు. సుమారు 1,000 గృహాలకు ఉచితంగా నల్లా కనెక్షన్లు ఇచ్చారు.ఈ పనులన్నింటినీ ప్రజారోగ్యశాఖ పర్యవేక్షించింది. ఇంతవరకు బాగానే ఉన్నా, కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పనుల్లో సింహభాగం నేటికీ వృథాగానే ఉన్నాయి. అందుకు మునిసిపల్‌, ప్రజారోగ్యశాఖ మధ్య సమన్వం కొరవడటమే కారణమని తెలుస్తుంది. అలాగే ప్రతిపాదిత పైపులైన్‌, నీటి ట్యాంకుల నిర్మాణం పూర్తయిన వెంటనే డిమాండ్‌ మేరకు తాగునీటిని అందిస్తామన్న మిషన్‌ భగీరథ అధికారులు కూడా నీటి సరఫరాపై మౌనం దాల్చారు.

ఎందుకిలా ?

ప్రజారోగ్యశాఖ చేపట్టిన పైపులైన్‌ పనులు అసంపూర్తిగా ఉండటం, నీటి సరఫరాపై మిషన భగీరథ అధికారులు మాట తప్పడంతోనే తాగునీటి సమస్య ఎదురవుతోందని మునిసిపల్‌ అధికారులు పేర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో పైపులైన్‌ లింక్‌ పనులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండగా, ఇప్పటివరకు పనుల వివరాలను చెప్పలేదని, పనులను అప్పగించలేదని మునిసిపల్‌ అధికారులు చెబుతున్నారు. అయితే ప్రజారోగ్యశాఖ అధికారులు మా త్రం అంచనాకు మించి పైప్‌లైన్‌ పనులు చేశామని, పనులు పూర్తయిన వెంటనే మునిసిపాలిటీకి అధికారికంగా అప్పగించామని, మిగిలి ఉన్న కొద్దిపాటి లింకు పనులను మునిసిపల్‌ నీటి సరఫరా విభాగం చూసుకోవాలని చెబుతున్నారు. నిధులు, సిబ్బంది ఉన్నా, చిన్నపాటి పనులను కూడా చేసుకోలేక ఎలా అని ప్రజాఆరోగ్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు. 2016లో పనులు చేపట్టే సమయంలో మిషన్‌ భగీరథ జలాలు ఇస్తామని చెప్పామని, కానీ ఆచరణ సాధ్యం కాదని తేలడంతో సికింద్రాబాద్‌ సైనిక్‌పురి రిజర్వాయర్‌ నుంచి హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ వర్క్స్‌ (హెచ్‌ఎండబ్ల్యుఎ్‌స) ద్వారానే డిమాండ్‌కు సరిపడా రక్షిత జలాల సరఫరాపై శ్రద్ధ చూపాలని 2017లోనే మునిసిపల్‌ అధికారులకు స్పష్టం చేశామని మిషన్‌ భగీరథ అధికారులు చెబుతున్నారు. మునిసిపాలిటీలో విలీన గ్రామాలైన బొమ్మాయిపల్లి, పగిడిపల్లి, రాయిగిరికి రూరల్‌ వాటర్‌ స్కీమ్‌ (ఆర్‌డబ్ల్యుఎస్‌) ద్వారా తా మే తాగునీటిని సరఫరా చేస్తున్నామని మిషన్‌ భగీరథ అధికారులు పేర్కొంటున్నారు. ఇలా మూ డు ప్రభుత్వశాఖల అధికారులు భిన్న ధోరణుల్లో ఉండటంతో కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పనులు ఏళ్ల తరబడిగా నిరుపయోగంగా నిలిచి, ప్రజలు తాగునీటి ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.

క్షేత్రస్థాయిలో ఇలా..

హుస్సేనాబాద్‌ ఇందిరమ్మ కాలనీలో మిషన్‌ భగీరథ పథకం కింద 10లక్షల లీటర్ల సామర్థ్యంతో ట్యాంకును నిర్మించారు. బస్తీల్లో పైప్‌లైన్‌ నిర్మించి ఇళ్లకు ఉచిత నల్లా కనెక్షన్లు కూడా ఇచ్చారు. ఇది పూర్తయి ఐదేళ్లు అవుతోంది. హెచ్‌ఎండబ్ల్యూఎ్‌స ద్వారా ప్రస్తుతం రోజువారీ సరఫరా అవుతున్న 5.7ఎంఎల్‌డీకి అదనంగా కనీసం మరో 2.5ఎంఎల్‌డీ నీటి సరఫరా జరిగితేనే ఇందిరమ్మ కాలనీ ట్యాంకు ద్వారా తాగునీరు సరఫరా సాధ్యమవుతుంది. అలాగే పట్టణంలోని నల్లగొండ రోడ్డు, జంఖానాగూడ, శివారు ప్రాంతమైన నందగుట్ట, సరస్వతీ నగర్‌తో పాటు పట్టణంలోని పలు బస్తీల్లో పైప్‌లైన్‌ లింకు పనులు అసంపూర్తిగా ఉన్నాయి. దీంతో ప్రత్యామ్నాయంగా మునిసిపాలిటీ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తుండగా, ఆర్థిక స్తోమత ఉన్న వారు బోరుబావులను ఏర్పాటుచేసుకున్నారు.

డిమాండ్‌కు సరిపడా సరఫరా లేదు : కొండల్‌రావు, భువనగిరి మునిసిపల్‌ డీఈ

మిషన్‌ భగీరథ పనుల్లో భాగంగా ప్రజారోగ్యశా ఖ చేపట్టిన పైపులైన్‌ పనులు కొన్ని ప్రాంతాల్లో నేటికీ అసంపూర్తిగా ఉన్నాయి. పలు బస్తీల్లో లిం కు పనులు పెండింగ్‌లో ఉన్నాయు. అలాగే గోదావరి జలాలను సరఫరా చేస్తామన్న మిషన్‌ భగీరథ అధికారులు సాంకేతిక కారణాలు చూపుతూ వాయిదా వేస్తున్నారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

చిన్నపాటి పనులను మునిసిపాలిటీనే చేసుకోవాలి : మనోహర్‌, ప్రజారోగ్యశాఖ డీఈ

టెండర్‌ ప్రక్రియకు మించి పనులు నిర్వహించాం. పూర్తయిన పనులను ఎప్పుడో మునిసిపాలిటీకి అప్పగించాం. ఆ తరువాత కూడా అధికారుల సూచనల మేరకు మరిన్ని పనులు చేశాం. మిగులు చిన్నపాటి పనులను మునిసిపాలిటీనే చేసుకోవాలి. అంతేగాని మాపై నెపం వేయడం సరికాదు. ప్రణాళిక లేకుండానే పలు పనులను ప్రతిపాదనల్లో చేర్చి మాతో పూర్తి చేయించడం సమస్యలకు కారణమవుతోంది. అయినప్పటికీ లింక్‌ తదితర పెండింగ్‌ పనుల వివరాలను అందజేస్తే అమృత్‌ 2.0 పనులతో పాటు ఆ పనులను కూడా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తాం.

రెండు నెలల్లో తాగునీటిని అందిస్తాం : కరుణాకర్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ

భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో మునిసిపాలిటీలు మినహా గ్రామీణ ప్రాంతాలకు రోజువారీగా 62ఎంఎల్‌డీ నీటి సరఫరా జరగాల్సి ఉంది. కానీ పలు కారణాలతో 32 ఎంఎల్‌డీ మాత్రమే ఇవ్వగలుగుతున్నాం. రూ.210కోట్లతో మల్లన్న సాగర్‌ నుంచి ఘన్‌పూర్‌ గ్రిడ్‌ వరకు ప్రతిపాదించిన పైపులైన్‌ పనులు చివరి దశలో ఉన్నాయి. మరో 300 మీటర్ల పనులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. ఆ పనులు పూర్తయితే రెండు నియోజకవర్గాలతో పాటు భువనగిరి పట్టణం, మిగతా మునిసిపాలిటీలకు డిమాండ్‌కు సరిపడా తాగునీటినీ అందిస్తాం.

Updated Date - Jul 16 , 2025 | 12:28 AM