ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

చదువుతో పాటు సంస్కారం

ABN, Publish Date - Apr 19 , 2025 | 12:02 AM

యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్‌ పట్టణంలోని 10వ వార్డులోని బీసీ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆదర్శవంతంగా నిలుస్తోంది.

విద్యార్థులకు బోధన చేస్తున్న ప్రధానోపాధ్యాయుడు

ఆదర్శం బీసీ కాలనీ ప్రభుత్వ పాఠశాల నిర్వహణ

యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్‌ పట్టణంలోని 10వ వార్డులోని బీసీ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆదర్శవంతంగా నిలుస్తోంది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ తల్లిదండ్రుల ఆదరాభిమానాలను ఉపాధ్యాయులు చూరగొంటున్నారు. చదువుతో పాటు సంస్కారాన్ని అలవరచుకునేలా విద్యార్థుల్లో క్రమశిక్షణను నేర్పిస్తున్నారు. మూడు దశాబ్దాల కిందట ప్రారంభించిన ఈ పాఠశాలలో ఇంగ్లీష్‌ మీడియంలో ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు విద్యాబోధన చేస్తున్నారు. పేదవర్గాల కాలనీలో ఏర్పాటుచేసిన ఈ పాఠశాలలో ప్రస్తుతం 110మంది విద్యార్థులు ఉన్నారు. ప్రైవేట్‌ విద్యాసంస్థలను తలదన్నే రీతిలో బోధన చేస్తుండడంతో విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తున్నారని తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

- (ఆంధ్రజ్యోతి-చౌటుప్పల్‌ టౌన)

బిహార్‌, ఉత్తరప్రదేశ, చత్తీ్‌షఘడ్‌ రాష్ట్రాలకు చెంది న వలస కూలీల పిల్లలు 25 నుంచి 30 మంది వరకు విద్యాభ్యాసం చేస్తున్నారు. వలస కూలీల పిల్లలకు అనువుగా విద్యాబోధన చేస్తున్నారు. ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు ఇద్దరు ప్రైవేట్‌ టీచర్స్‌ విద్యార్థులకు బోధనకు నియమించారు. వీరికి ప్రభుత్వ ఉపాధ్యాయు లే నెలనెలా జీతాలు చెల్లిస్తూ మెరుగైన విద్యను అందించేందుకు దోహదం చేస్తున్నారు.

సుమారు 2 వేల గజాల విస్తీర్ణంలో...

సుమారు 2 వేల గజాల విస్తీర్ణంలో ఈ పాఠశాలను ఏర్పాటు చేశారు. ఇందులో మూడు తరగతి గదులతో పాటు ఒక స్టాఫ్‌ గదిని నిర్మించారు. ఐదు తరగతుల నిర్వహణకు గదులు సరిపడకపోవడంతో వరండాలలో విద్యార్థులకు బోధన చేస్తున్నారు. కాగా, పాఠశాలకు ఒక అదనపు తరగతి గదిని నిర్మించేందుకు తన నిధుల నుంచి రూ.12 లక్షలను కేటాయిస్తున్నట్టు ఏడాది క్రితం ఉపాధ్యాయ మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రకటించారు. కానీ అమలుకు నోచుకోలేదు.

విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ

పాఠశాల ప్రధానోపాద్యాయుడు కే హర్షవర్థనరెడ్డి విద్యార్థులపై ప్రత్యేకశ్రద్ధ వహిస్తున్నారు. తరగతులకు గైర్హాజరయ్యే విద్యార్థుల సమాచారాన్ని ప్రతి రోజూ వారి తల్లిదండ్రులకు సెల్‌ఫోన ద్వారా తెలియజేయడం, ఫోన సౌకర్యం లేకుంటే నేరుగా వారి ఇళ్లకే వెళ్లి చెబుతుంటా రు. చదువులో కొద్దిగా వెనకబడిన విద్యార్థులకు ప్రత్యేకబోధన చేస్తుంటారు. విద్యార్థుల్లో క్రమశిక్షణను పెంపొందించడం, తల్లి దండ్రులతో పాటు పెద్దలను గౌరవించ డం వంటి ఉదాత్తగుణాలను ఆచరించేలా తయారుచేస్తున్నారు. చదువుతో పాటు వ్యక్తిగత ప్రవర్తనలో మా ర్పు తెచ్చేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. చిన్నతనం నుం చే విద్యార్థులు సత్ప్రవర్తనను అలవరచుకునేలా విద్యాబుద్ధలు నేర్పిస్తున్నారు. చదువుతో పాటు సంస్కారం అవసరమన్న సిద్ధాంతాన్ని అమలుచేస్తున్నారు.

ఆహ్లాదకరమైన వాతావరణం

పాఠశాల ఆవరణ పచ్చనిచెట్లతో నిండి విద్యార్థుల కు ఆహ్లాదకరమైన వాతావరణం లభిస్తోంది. పాఠశాల ముందు భాగంతో పాటు లోపలిభాగంలో అందమైన పూలమొక్కలను పెంచుతున్నారు. 2024 ఆగస్టు 5న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నాటి న మొక్కలు పచ్చదనంతో అలరారుతున్నాయి. ప్రత్యేకంగా కృష్ణా వాటర్‌ సరఫరా సౌకర్యాన్ని కల్పించడం తో విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మన ఊరు(బస్తీ)-మన బడి పథకం కింద తీసుకున్న ఈపాఠశాలలో విద్యార్థులకు కబోర్డు బెంచీలను ఏర్పా టు చేశారు. పాఠశాల భవన సముదాయానికి అందమైన కలర్స్‌ వేయడంతో విద్యార్థులను ఆకర్షిస్తోంది. పాఠశాల చూడ ముచ్చటగా ఉండడంతో ప్రవేశాల కోసం విద్యార్థులు ఆసక్తిని కనబరుస్తున్నారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నాం

విద్యార్థులకు నాణ్యమైన విద్య ను అందించడంతో పాటు చదువులో వెనకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేకచర్యలు తీసుకుంటున్నాం. 10 రోజులుగా బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులలో చైతన్యాన్ని కల్పిస్తున్నాం. పాఠశాలలోని విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను వివరిస్తున్నాం. ఈ పాఠశాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలన్న పట్టుదలతో పనిచేస్తున్నాం. పాఠశాలకు ఒక అదనపు తరగతి అవసరం ఉంది. ఈ గదిని నిర్మించేందుకు దివీస్‌ సంస్థ ముందుకు వచ్చింది. అదేవిధంగా ఖాళీగా ఉన్న ఒక టీచర్‌ పోస్ట్‌ను భర్తీ చేయాల్సి ఉంది.

- కంచర్ల హర్షవర్థనరెడ్డి, ప్రధానోపాద్యాయుడు

Updated Date - Apr 19 , 2025 | 12:02 AM