‘స్థానిక’ ఎన్నికల్లో కాంగ్రె్‌సను గెలిపించాలి
ABN, Publish Date - Jun 21 , 2025 | 12:18 AM
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నా రు. శుక్రవారం ఆలేరులో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయ న మాట్లాడారు. కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం 18 నెలల్లోనే అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తోందన్నారు.
ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య
ఆలేరు, జూన్20(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నా రు. శుక్రవారం ఆలేరులో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయ న మాట్లాడారు. కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం 18 నెలల్లోనే అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తోందన్నారు. నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో అన్ని సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో కాంగ్రె్‌సను అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆలేరును కంచుకోటగా నిలపాలని అభ్యర్థించారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రజాప్రభుత్వం అమలు చేస్తు న్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై పార్టీ శ్రేణులు గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలన్నారు. ప్రజాబలంతో 50 వేల మెజార్టీతో తాను ఎమ్మెల్యేగా గెలిచానన్నారు. ప్రజా వ్యతిరేకతతో ఓడిపోయిన బీఆర్‌ఎస్ నేతలు విమర్శలు చేయ డం శోచనీయమన్నారు. ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. ఆలేరు ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకూ తనను ఏమీ చేయలేరన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో ఆలేరు రాష్ట్రంలో రెండో స్థానంలో ఉందన్నారు. ఇప్పటివరకు 3,500 ఇండ్లు, 10వేల మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశానన్నారు. చేనేత చేయూత పథకం ద్వారా మంజూరైన రూ.30లక్షల చెక్కును ఆయన అందజేశారు. కార్యక్రమంలో మద ర్ డెయిరీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పల్లె శ్రీనివా్‌సగౌడ్, టీపీసీసీ కార్యదర్శి జనగాం ఉపేందర్‌రెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ, కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షులు వెంకటేశ్వర రాజు, ఎజాజ్, నాయకులు ఐనాల చైతన్య మహేందర్‌రెడ్డి, ఎగ్గిడి యాదగిరి, సముద్రాల సత్యం, కె.సాగర్‌రెడ్డి, ఆరె.ప్రశాంత్, గంధమల్ల అశోక్, బాలరాజు, శ్రీశైలం పాల్గొన్నారు.
Updated Date - Jun 21 , 2025 | 12:18 AM