జీవోల పేరుతో కాంగ్రెస్ డ్రామాలు
ABN, Publish Date - Jul 13 , 2025 | 11:51 PM
ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 42శాతం చట్టబద్దంగా ఇస్తామని ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి న కాంగ్రెస్ ఇప్పుడు జీవోల పేరుతో డ్రామాలు చేస్తూ బీసీలను మరోసారి మోసగిస్తుందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి
భువనగిరి గంజ్, జూలై 13 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 42శాతం చట్టబద్దంగా ఇస్తామని ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి న కాంగ్రెస్ ఇప్పుడు జీవోల పేరుతో డ్రామాలు చేస్తూ బీసీలను మరోసారి మోసగిస్తుందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, గొంగిడి సునీత, బూడిద భిక్షమయ్య గౌడ్‌తో కలిసి విలేకరులతో మా ట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేస్తామన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ అబద్ధపు హామీల మీద అధికారంలోకి వచ్చిందని, హామీలు నేరవేర్చకుండా పూర్తిగా విఫలమైందన్నారు. 18 నెలల పాలనలో ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని, జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లు పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇస్తున్నారని, నిరుపేద కుటుంబాలకు ఇవ్వలేదన్నారు. కార్యక్రమంలో నాయకులు క్యామ మల్లేష్, రాకే్‌షరెడ్డి, కల్లూరి రాంచంద్రారెడ్డి, బీరు మల్లయ్య, తోటకూరి అనురాధ, రచ్చ శ్రీనివా్‌సరెడ్డి, ర్యాకల శ్రీనివాస్, ఏవీ కిరణకుమార్, అంకర్ల మురళీ పాల్గొన్నారు.
Updated Date - Jul 13 , 2025 | 11:51 PM