పంచాయతీ నిధుల దుర్వినియోగంపై ఆందోళన
ABN, Publish Date - Jul 08 , 2025 | 12:34 AM
గ్రామాభివృద్ధికి వినియోగించాల్సిన నిధులు దుర్వినియోగం కావడంపై మండలంలోని కొండమడుగు గ్రామస్థు లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధీకులపై చర్య లు తీసుకోవాలని కోరుతూ పార్టీలకతీతంగా సోమవారం పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళన కు దిగారు.
బీబీనగర్, జూలై 7 (ఆంధ్రజ్యోతి) : గ్రామాభివృద్ధికి వినియోగించాల్సిన నిధులు దుర్వినియోగం కావడంపై మండలంలోని కొండమడుగు గ్రామస్థు లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధీకులపై చర్య లు తీసుకోవాలని కోరుతూ పార్టీలకతీతంగా సోమవారం పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళన కు దిగారు. నిబంధనలకు విరుద్ధంగా రూ.93లక్షల కు పైగా నిధులను దుర్వినియోగం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం జిల్లా కేంద్రం భువనగిరిలో కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి పంచాయతీ నిధులు కాజేసిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హనుమంతరావును కలిసి ఫిర్యాదుచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న అదనపు కలెక్టర్ వీరారెడ్డి పంచాయతీ కార్యాలయాన్ని తనిఖీచేశారని, నిధుల ఖర్చుకు సంబంధించి రికార్డులను పరిశీలించగా అవకతవకలు జరిగినట్లు గుర్తించారన్నారు. ఈ మేరకు డీఎల్‌పీవో శ్రీకాంత్‌రెడ్డి విచారణ చేపట్టి గడిచిన మూడేళ్లలో మొత్తం రూ.93,43,372 లక్షలు దుర్వినియోగం అయ్యాయని నివేదిక ఇచ్చారన్నారు. నివేదికను ఏప్రిల్ 11న ప్రభుత్వానికి అందజేసి మూడు నెలలు గడుస్తున్నా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని గ్రామస్థులు మండిపడ్డారు. పంచాయతీ నిధుల దుర్వినియోగానికి పాల్పడిన కార్యదర్శి, ప్రత్యేక అధికారి, వీరికి సహకరించిన పైఅధికారులపై కఠిన చర్యలు తీసుకుని పక్కదారి పట్టిన నిధుల ను రికవరి చేసి విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్
యాదాద్రి, జూలై 7 (ఆంధ్రజ్యోతి) : బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామపంచాయతీ కార్యదర్శి అలివేలుని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఎం.హనుమంతరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పలు అక్రమాలకు పాల్పడినందున సస్పెండ్ చేస్తున్నట్టు పేర్కొన్నా రు. మండల పంచాయతీ అధికారి, కొండమడుగు ప్రత్యేక అధికారి మాజిద్‌ను ఎందుకు సస్పెండ్ చేయకూడదో తెలపాలని షోకాజ్ నోటీసులు జారీచేశారు.
అదేవిధంగా కొండమడుగు కార్యదర్శిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిప్యూటీ సీఈవో విష్ణువర్థన్‌రెడ్డికి ఆదేశాలు జారీచేశారు. మేజర్ పంచాయతీల్లో ఇటువంటి వాటిపై విచారణ చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావును ఆదేశించారు.
Updated Date - Jul 08 , 2025 | 12:34 AM