క్రీడలతో ఏకాగ్రత ఏర్పడుతుంది
ABN, Publish Date - Jun 24 , 2025 | 12:29 AM
క్రీడలతో ఏకాగ్రత ఏర్పడుతుందని అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. సోమవారం అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం సందర్భంగా జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి కే.ధనంజనేయులు ఆధ్వర్యంలో ఒలింపిక్‌డే రన్‌ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు.
అదనపు కలెక్టర్ వీరారెడ్డి
భువనగిరి గంజ్, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): క్రీడలతో ఏకాగ్రత ఏర్పడుతుందని అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. సోమవారం అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం సందర్భంగా జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి కే.ధనంజనేయులు ఆధ్వర్యంలో ఒలింపిక్‌డే రన్‌ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి హెడ్‌పోస్టాఫీస్ వరకు సాగింది. అదేవిధంగా సీఎం కప్-2024లో రాష్ట్రస్థాయిలో గెలుపొందిన జూడో క్రీడాకారులకు షీల్డ్, సర్టిఫికెట్స్ అందజేశారు. కార్యక్రమంలో జానకిరాములు, మురళి, రేణుక, జయ, కైసర్, రేణుక, ఎంఈవో నాగవర్ధన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఆయిల్‌పామ్ వాణిజ్య పంట
భువనగిరి రూరల్, జూన్ 23(ఆంధ్రజ్యోతి): ఆయిల్‌పామ్‌ను రైతులందరూ వాణిజ్య పంటగా సాగు చేసి లాభాలు సాధించాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని నమాత్‌పల్లి గ్రామంలో డాక్టర్ అతికం శ్రీనివాస్ వ్యవసాయ క్షేత్రంలో 23ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్‌పామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఆయిల్‌పామ్ పంట సాగులో మొదటి నాలుగేళ్లు అంతర్ పంటగా పెసర, పత్తి, మిర్చి, బొప్పాయి, వేరుశనగ సాగు చేసి అదనపు ఆదాయం పొందవచ్చన్నారు. ఆయిల్‌పామ్ సాగులో చీడపీడల సమస్య, కోతుల బెడద, ప్రకృతి వైపరీత్యాల సమస్య ఉండదన్నారు. అదేవిధంగా నాలుగేళ్ల వరకు ఎకరానికి రూ.4,200 చొప్పున ప్రభుత్వం ఏటా రైతుల ఖాతాలో సబ్సిడీ జమ చేస్తుందన్నారు. కార్యక్రమంలో డీఏవో గోపాల్, ఉద్యానశాఖ జిల్లా అధికారిని సుభాషిని, ఆయిల్‌ఫెడ్ జిల్లా అధికారి ఖాజా, ఎంపీడీవో సీహెచ్.శ్రీనివా్‌స, ఏడీఏ వెంకటేశ్వర్లు, ఏవో మల్లేశ్, మాధవి, స్నేహిత, కవిత, స్రవంతి, ఎ.జైపాల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 24 , 2025 | 12:29 AM