ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రండి.. చూడండి.. పాఠశాలలో చేర్పించండి

ABN, Publish Date - Jun 17 , 2025 | 12:17 AM

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కార్పొరేట్‌ రంగానికి దీటుగా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

కోదాడ టౌన, జూన 16 (ఆంధ్రజ్యోతి) : సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కార్పొరేట్‌ రంగానికి దీటుగా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ బడిలో నాణ్యమైన విద్య అందిస్తున్నాం, పాఠశాలకు రండి, వసతులు పరిశీలించి, విద్యార్థులను చేర్పించాలని అవగాహన కల్పిస్తున్నారు. ఇందుకోసం ఉపాధ్యాయ బృందం ఊరు వాడల్లో కరపత్రం, ఫ్లెక్సీ, వాయిస్‌ రికార్డు, ఆటోతో ఓ బృందం, బైకులు మరో ఉపాధ్యాయ బృందం విస్త్రృత ప్రచారం నిర్వహిస్తున్నారు. కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం, అశోక్‌నగర్‌, లక్ష్మీపురం గ్రామాల్లో పర్యటించి విద్యార్థులను, తల్లిదండ్రులను కలుస్తున్నారు. పాఠశాలలోని సౌకర్యాలు, ఫలితాలను తెలియజేస్తూ నాణ్యమైన విద్యను అందిస్తున్నామని మీ పిల్లలను మా పాఠశాలలో చేర్పించాలని కోరుతున్నారు. సోమవారం నిర్వహించిన బడిబాటో ఉపాధ్యాయులు దేవరాజు, బ్రహ్మానందం, ఖాజామియా, జానకిరామ్‌, చిన్నప్ప, అశోక్‌గౌడ్‌, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - Jun 17 , 2025 | 12:17 AM