ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

14న తిరుమలగిరికి సీఎం రాక

ABN, Publish Date - Jul 03 , 2025 | 12:29 AM

సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 14న తిరుమలగిరికి రాను న్నారు. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా మరో ప్రతిష్టాత్మక పథకం ప్రారంభోత్సవానికి వేదిక కాబోతోంది. రేషన్‌కార్డుల ద్వారా నిరుపేదలకు ఉచితం గా సన్న బియ్యం ఇచ్చే పథకాన్ని ఇటీవల సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు.

కొత్తరేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమ సభ

నల్లగొండ, జూలై 2(ఆంధ్రజ్యోతిప్రతినిధి): సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 14న తిరుమలగిరికి రాను న్నారు. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా మరో ప్రతిష్టాత్మక పథకం ప్రారంభోత్సవానికి వేదిక కాబోతోంది. రేషన్‌కార్డుల ద్వారా నిరుపేదలకు ఉచితం గా సన్న బియ్యం ఇచ్చే పథకాన్ని ఇటీవల సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు.తాజాగా కొత్త రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో నిర్వహించే బహిరంగసభ ద్వారా ప్రారంభిస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బుధవారం ప్రకటించారు. ఈ నెల 14న తిరుమలగిరి పట్టణంలో నిర్వహించే ఈ బహిరంగసభకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క హాజరవుతారని మంత్రి ఉత్తమ్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో దాదాపు పదేళ్ల తర్వాత కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేస్తుండడంతో ఉమ్మడి జిల్లాలో పెద్ద ఎత్తున కొత్తరేషన్‌కార్డులు రాబోతున్నాయి.

13లోగా కొత్తరేషన్‌కార్డుల ఎంపిక పూర్తయ్యేలా..

కొత్తరేషన్‌కార్డులను ఈ నెల 14న సీఎం రేవంత్‌రెడ్డి పంపిణీ చేయను న్న నేపథ్యంలో ఈనెల 13 లోపే కొత్తరేషన్‌కార్డుల లబ్ధిదారుల ఎంపిక పూర్తిచేయాలని మంత్రి ఉత్తమ్‌ ఆదేశాలమేరకు పౌరసరఫరాలశాఖ, రెవన్యూశాఖ అధికారులు యుద్ధప్రాతిపదికన పనిచేస్తున్నారు. గతంలో మీసేవా ద్వారా వచ్చిన దరఖాస్తులు, ప్రజాపాలన దరఖాస్తులతోపాటు, ఇటీవల సేకరించిన దరఖాస్తులను అన్ని కోణాల్లో వడపోస్తున్నారు. క్షేత్రస్థాయిల్లో ఇప్పటికే పరిశీలించారు. ఉమ్మడి జిల్లాలో దరఖాస్తులు భారీగా రావడంతో ఆచితూచి ఎంపిక చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు నల్లగొండ జిల్లాలో 51వేల దరఖాస్తులు, సూర్యాపేట జిల్లాలో 46వేలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 34,316 దరఖాస్తులకు సంబంధించి వెరిఫికేషన్‌ పూర్తిచేశారు. ఇంకా దాదాపు లక్ష వరకు దరఖాస్తులు పరిశీలించాల్సి ఉంది. వీటన్నింటినీ పరిశీలించి 13వ తేదీలోపు కొత్త కార్డుల జాబితా విడుదల చేయాలని అధికారులు పనిచేస్తున్నారు.

నిధులు రాబట్టేందుకు ఎమ్మెల్యే యత్నాలు

సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో తుంగతుర్తి నియోజకవర్గంలో పలు పథకాలు, ప్రాజెక్టులకు సంబంధించి నిధులు రాబట్టేందుకు హామీలు పొందేందుకు ఎమ్మెల్యే మందుల సామేల్‌ ప్రతిపాదనలు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రధానంగా మూసీ కాల్వల పెండింగ్‌ పనులు, రాచకాల్వ, దేవాదుల చివరి దశ కాల్వల పనులు, ధర్మారెడ్డి, పిల్లాయిపల్లి కాల్వలు, కేతిరెడ్డి కాల్వకు నిధుల కోసం ఎమ్మెల్యే ప్రతిపాదనలు సిద్ధం చేసుకుంటున్నారు. అదేవిధంగా తుంగతుర్తి నియోజకవర్గంలో జూనియర్‌ కాలేజీలు, డిగ్రీ కాలేజీలతోపాటు, ఏటీసీ,స్కిల్‌డెవల్‌పమెంట్‌ సెంటర్‌ ఏర్పాటుకు సీఎం నుంచి హామీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. వీటితోపాటు ఎత్తిపోతల పథకాలు, రోడ్ల నిర్మాణాలకు నిధులు సాధించేందుకు ఈ సభనుంచి హామీ పొందుతారని కాంగ్రెస్‌ క్యాడర్‌లో చర్చ సాగుతోంది.

Updated Date - Jul 03 , 2025 | 12:29 AM