ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

చిరకాల వాంఛ నెరవేర్చిన సీఎం

ABN, Publish Date - Jul 12 , 2025 | 12:30 AM

మాదిగల చిరకాల వాంఛ ఏబీసీడీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించి దానిని అమలు చేసిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డికి దక్కిందని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తెలిపారు. శుక్రవారం యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు

యాదగిరిగుట్ట రూరల్‌, జూలై 11, (ఆంధ్రజ్యోతి): మాదిగల చిరకాల వాంఛ ఏబీసీడీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించి దానిని అమలు చేసిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డికి దక్కిందని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తెలిపారు. శుక్రవారం యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏబీసీడీ వర్గీకరణకు మందకృష్ణ మాదిగను ముందుపెట్టి వెనుక నుంచి పూర్తి సహకారం అందించామన్నారు. సుప్రీంకోర్టు తీర్పును మొట్టమొదటగా అమలు చేసిన ఘనత తెలంగాణకే దక్కిందన్నారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఇద్దరు బీసీలు, ఒక దళితునికి మంత్రి పదవులు కేటాయించడం హర్షణీయమన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రజాపాలనలో చేపడుతున్న సంక్షేమ పథకాలైన సన్నబియ్యం, రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రుణమాఫీ, రైతు భరోసా అర్హులందరికీ చేరాలన్నారు. రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో అనేక నిర్ణయాలు తీసుకోవడానికి హైకమాండ్‌ పూర్తి అవకాశాలు ఇవ్వాలన్నారు. అనంతరం మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య, పార్టీ కార్యకర్తలు, అభిమానుల మద్య బర్త్‌డే కేక్‌ కట్‌చేసి జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. సమావేశంలో ఆలేరు మార్కెట్‌ డైరెక్టర్‌ శివరాత్రి దానయ్య, సర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బీర్ల శంకర్‌, పార్టీ మండల అధ్యక్షుడు మంగ సత్యనారాయణ, ముకుందారెడ్డి, పట్టణ అధ్యక్షుడు బందారపు భిక్షపతిగౌడ్‌, ఎరుకల హేమేందర్‌గౌడ్‌, మారగోని శ్రీరాంమూర్తిగౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 12 , 2025 | 12:30 AM