ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సీఎం సార్‌ కాలేజీలు మంజూరు చేయరూ

ABN, Publish Date - Jun 06 , 2025 | 12:21 AM

రాజాపేట, జూన 5(ఆంధ్రజ్యోతి): రాజాపేట మండలంలో జూనియర్‌, డిగ్రీ కళాశాల లేకపోవడంతో నిరుపేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారు.

రాజాపేట, జూన 5(ఆంధ్రజ్యోతి): రాజాపేట మండలంలో జూనియర్‌, డిగ్రీ కళాశాల లేకపోవడంతో నిరుపేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. విద్యార్థులు ఉన్నత చదువుల కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణించలేక చదువు అర్ధాంతరంగా ముగింపు పలకాల్సి వస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో నేతలిస్తున్నా హామీలు హమీలుగానే మిగిలిపోతున్నాయి మండలంలో 38, 454 జనాభా ఉంది. 13 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 2 ప్రైవేట్‌ ఉన్నత పాఠశాలలున్నాయి. ఈ విద్యాసంవత్సరం పదోతరగతి పరీక్షలకు 309 మంది విద్యార్థులు హాజరు కాగా 304 మందిఉత్తీర్ణులయ్యారు. ఇప్పటివరకు మండల కేంద్రంలో ఉన్న ప్రైవేట్‌ కళాశాలలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో విద్యార్థులు ఇంతకాలం చదువులను కొనసాగించారు. ప్రభు త్వం కళాశాలకు ఫీజు రీయింబర్స్‌ మెంటు చెల్లించకపోవడంతో బకాయిలు పేరుకుపోవడంతో యాజమాన్యం కాలేజీని నిర్వహించడం ఇబ్బందిగా మారడంతో మూసివేశాయి. జూనియర్‌, డిగ్రీ రెండు కళాశాలలు మూతపడ్డాయి. మండల కేంద్రంలో ఉన్న ఒకే ఒక కళాశాల మూత పడటంతో విద్యార్థుల చదువులకు ఇబ్బంది ఏర్పడింది.

ఉన్నత విద్య కోసం పట్టణాలకు....

మండల కేంద్రంలో ఇంటర్‌, డిగ్రీ వరకు ఉన్న ప్రైవేట్‌ కళాశాల మూతపడటంతో ఉన్నత విద్య కోసం విద్యార్థులు ఇతర పట్టణాలకు వెళ్లాల్సి వస్తుంది. మండలం నుంచి 30,40 కిలోమీటర్ల దూ రంలో ఉన్న ఆలేరు, భువనగిరి, జగదేవపూర్‌, చేర్యా ల, జనగాం, హైదరాబాద్‌కు వెళ్లి చదువుకోవడం వ్యయ ప్రయాసలతో కూడుకున్నదే. లేదంటే చదువుకు స్వస్తి చెప్పాల్సిందే. మండల కేంద్రం నుంచి రోజు ఇతర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాలన్న మెరుగైన బస్సు సౌకర్యం లేదు. బాలికలు మరీ ఇబ్బంది పడాల్సిందే. అంతే కాకుండా మండలంలో ప్రజలు అధికంగా వ్యవసాయం, పాడి పైనే ఆధారపడి జీవిస్తున్నారు. వేలు, లక్షలు పెట్టి చదివించే స్థోమత లేని పేద ప్రజలే అధికంగా ఉన్నారు. కాగా బాలబాలికల చదువులు కొనసాగాలంటే మండల కేంద్రంలో ప్రభుత్వ కళాశాల ఏర్పాటుతోనే సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

కళాశాల కోసం నేతలకు వినతి

మండల కేంద్రంలో కళాశాల ఏర్పాటు కోసం నేతలందరికీ మండల ప్రజలు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నారు. మాజీ ఎమ్మెల్యేలు మోత్కుపల్లి నుంచి మొదలుకొని ప్రస్తుత ప్రభుత్వ విప్‌ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య వరకు పలుసార్లు వినతిపత్రాలను అందజేశారు. కానీ ఆచరణ అమలుకావడం లేదు.

కళాశాల ఏర్పాటుకు అన్ని వసతులు..

మండల కేంద్రంలో కళాశాల ఏర్పాటుకు కావల్సిన సదుపాయాలున్నాయి. మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్‌ ,రేణికుంటలోని ఉన్నత పాఠశాలలు మూత పడటంతో గదులు ఖాళీగా ఉన్నాయి. సరిపోను గదులు ఉండటంతో పాటు నీటి సదుపా యం, విద్యుత సౌకర్యం ఉన్నాయి. దీంతో కాలేజి ఏర్పాటుకు ఎలాంటి ఇబ్బందులుండవు.

Updated Date - Jun 06 , 2025 | 12:21 AM