ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

30న హుజూర్‌నగర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి

ABN, Publish Date - Mar 26 , 2025 | 12:10 AM

సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 30న సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ పట్టణంలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ ఖరారుకావడంతో పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంగళవా రం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.

పర్యటన షెడ్యూల్‌ ఖరారు

ఉగాది పర్వదినాన సన్న బియ్యం పంపిణీ ప్రారంభం

మోడల్‌ కాలనీ ఇళ్లను పరిశీలించనున్న సీఎం

భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు

(ఆంధ్రజ్యోతి,హుజూర్‌నగర్‌ ): సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 30న సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ పట్టణంలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ ఖరారుకావడంతో పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంగళవా రం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ఈనెల 30ఆదివారం సాయం త్రం 6గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి హుజూర్‌నగర్‌ పట్టణంలో ప్రారంభించనున్నారు.

హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం సాయంత్రం 5గంటలకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి బయలుదేరి 5.45గంటలకు హుజూర్‌నగర్‌లోని రామస్వామి గట్టు వద్ద ఏర్పాటుచేసిన హెలీప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు. అనంతరం నిర్మాణంలో ఉన్న 2,160 ఇళ్ల మోడల్‌ కాలనీని సీఎం పరిశీలిస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 6.15 గంటలకు పట్టణంలోని ఫణిగిరిగట్టు వద్ద రాజీవ్‌ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతారు. ఉగాది పర్వదినం సందర్భంగా బహిరంగ సభలోనే సీఎం రేవంత్‌రెడ్డి సన్నబియ్యం పంపిణీ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. 6.15 నుంచి 7.30గంటల వరకు సుమారు 40నిమిషాల పాటు సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగసభలో ప్రసంగిస్తారు. తిరిగి 7.30గంటలకు హుజూర్‌నగర్‌ నుంచి రోడ్డు మార్గంలో 9.45 గంటలకు హైదరాబాద్‌కు చేరుతారు. సభలో సీఎంతోపాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యే లు పాల్గొంటారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సుమా రు 50వేల మంది సభకు హాజరయ్యేలా ఏర్పాట్లు సాగుతున్నాయి. కాగా, సీఎం సభ సందర్భంగా మంగళవారం ఏర్పాట్లను పౌరసరఫరాశాఖ జాయింట్‌ సెక్కటరీ ప్రియాంకఅల, కలెక్టర్‌ తేజ్‌సనందాలాల్‌, ఎస్పీ నర్సింహులు, అదనపు కలెక్టర్‌ రాంబాబు పరిశీలించారు.

Updated Date - Mar 26 , 2025 | 12:10 AM