సోనియా,రాహుల్‌పై చార్జిషీట్‌ను ఉపసంహరించుకోవాలి
ABN, Publish Date - Apr 17 , 2025 | 11:51 PM
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్‌గాంధీపై వేసిన చార్జిషీట్‌ను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికా ర ప్రతినిధి చకిలం రాజేశ్వర్‌రావు డిమాండ్ చేశారు.
సూర్యాపేట టౌన, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్‌గాంధీపై వేసిన చార్జిషీట్‌ను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికా ర ప్రతినిధి చకిలం రాజేశ్వర్‌రావు డిమాండ్ చేశారు. గురువా రం జిల్లా కేంద్రంలోని తపాలా శాఖ కార్యాలయ ప్రాంతంలో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం విపక్షాల గొంతు అణిచివేయాలని చూస్తోందని మండిపడ్డారు. సోనియా, రాహుల్‌గాంధీలపై అక్రమ కేసులు పెడితే సహించేది లేదన్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రికను జవహర్‌లాల్‌సెహ్రూ స్థాపించారని, అది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారని, ఆ పత్రికను నష్టాలు రావడంతో మూసివేశారన్నారు. ఈ ఆస్తులకు సంరక్షకులుగా ఉన్న నేటి తరం కాంగ్రెస్ నేతలు వాటిని ఇతరత్రా కార్యక్రమాలకు వాడుకుంటే తప్పెంటో బీజేపీ ప్రభుత్వం చెప్పాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అంజద్‌అలీ, కక్కిరేణి శ్రీనివాస్, అబినయ్, బైరు శైలేందర్‌గౌడ్, వేణుగోపాల్, మా ణిక్యం, వీరన్ననాయక్, రమేష్, బాలుగౌడ్, శబరినాథ్, వాసు, రవి, సుదర్శనరెడ్డి, వెంకటేశ్వర్లు, రఘు, శ్రీనివాస్, నర్సయ్యయాదవ్, రాము, కరుణాకర్‌రెడ్డి, మధుకర్‌రెడ్డి, నరే్‌షపిళ్ళె, శిరీష, సంజయ్ పాల్గొన్నారు.
Updated Date - Apr 17 , 2025 | 11:51 PM