ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సీఎం సభా స్థలం మార్పు

ABN, Publish Date - Jun 01 , 2025 | 12:19 AM

సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభా స్థలాన్ని తిర్మలాపూర్‌కు మార్చారు. తుర్కపల్లి మండలం వాసాలమర్రిలోని పెట్రోల్‌ బంక్‌ సమీపంలో బహిరంగ సభ నిర్వహించాలని రెండు రోజుల క్రితం అనుకున్నారు. ముందుగా ఖరారు చేసిన స్థలం సమాంతరంగా లేకపోవడం, పక్కనే పెట్రోల్‌ బంక్‌ ఉండడంతో సభ ఏర్పాటు చేయడానికి అనుమతులు ఇవ్వలేదు.

వాసాలమర్రి నుంచి తిర్మలాపూర్‌కు మార్పు

తుర్కపల్లికి జూన్‌ 6న సీఎం రేవంత్‌రెడ్డి రాక

ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌ హనుమంతరావు

తుర్కపల్లి, మే 31(ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభా స్థలాన్ని తిర్మలాపూర్‌కు మార్చారు. తుర్కపల్లి మండలం వాసాలమర్రిలోని పెట్రోల్‌ బంక్‌ సమీపంలో బహిరంగ సభ నిర్వహించాలని రెండు రోజుల క్రితం అనుకున్నారు. ముందుగా ఖరారు చేసిన స్థలం సమాంతరంగా లేకపోవడం, పక్కనే పెట్రోల్‌ బంక్‌ ఉండడంతో సభ ఏర్పాటు చేయడానికి అనుమతులు ఇవ్వలేదు. దీంతో అధికారులు సభా స్థలాన్ని మార్చారు. జూన్‌ 6న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తుర్కపల్లి మండలం తిర్మలాపూర్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి అక్కడే ఏర్పాటు చేసే బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈమేరకు తుర్కపల్లి మండలం తిర్మలాపూర్‌లో బహిరంగ సభకు సంబంధించిన స్థలంతోపాటు హెలిప్యాడ్‌, పార్కింగ్‌ స్థలాలను శనివారం కలెక్టర్‌ హనుమంతరావు, రెవెన్యూ, పోలీస్‌, ఇరిగేషన్‌, ఆర్‌అండ్‌బీ శాఖలతోపాటు వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. తిర్మలాపూర్‌ గ్రామంలోని అంజన్నగట్టు సమీపంలోని భువనగిరి- గజ్వేల్‌ రహదారి పక్కన సీఎం సభకు అనుకూలమైన స్థలంగా గుర్తించారు. సభ నిర్వహణకు సంబంధించిన పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి, యాదగిరిగుట్ట ఏసీపీ శ్రీనివా్‌సనాయుడు, తహసీల్దార్‌ దేశ్యానాయక్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అంకిత భావంతో పని చేసినప్పుపడే గుర్తింపు

ఉద్యోగులు అంకిత భావంతో పని చేసినప్పుడే సమాజంలో గుర్తింపు వస్తుందని కలెక్టర్‌ హనుమంతరావు అన్నారు. శనివారం తుర్కపల్లి మండలం వెంకటాపూర్‌ గ్రామంలో ఎంపీడీవో ఝాన్సీలక్ష్మిబాయి పదవీ విరమణ సన్మాన కార్యక్రమంలో మాట్లాడారు. రికార్డ్‌ అసిస్టెంట్‌ నుంచి వివిధ హోదాలో పని చేసి ఎంపీడీవో స్థాయికి ఎదగడంతోపాటు అనతి కాలంలోనే మండల ప్రజల మన్ననలు పొందడం ఆమె అంకిత భావానికి నిదర్శనమన్నారు. ఇన్‌చార్జి ఎంపీడీవో వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి, జడ్పీ సీఈవో శోభారాణి, డీఆర్‌డీవో నాగిరెడ్డి, జడ్పీ డిప్యూటీ సీఈవో విష్ణువర్థన్‌రెడ్డి, ఆలేరు మార్కెట్‌ చైర్మన్‌ అయినాల చైతన్యమహేందర్‌రెడ్డి, సీఈవో రాఘవేందర్‌రావు, పంచాయతీరాజ్‌ మినిస్టీరియల్‌ రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, టీజీవో రాష్ట్ర కోషాధికారి ఉపేందర్‌రెడ్డి, టీజీవో జల్లా అధ్యక్షుడు జగన్‌ మోహన్‌ ప్రసాద్‌, ఎంపీడీఓల సంఘం అధ్యక్షులు శ్రీనివా్‌సరెడ్డి, బాలరాజ్‌రెడ్డి, తహసీల్దార్‌ దేశ్యానాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 01 , 2025 | 12:19 AM