కాల్వల భూపరిహారం నిధులూ మింగేశారు
ABN, Publish Date - Apr 18 , 2025 | 12:18 AM
ఏఎమ్మార్పీ డిస్ట్రిబ్యూటరీ కాల్వల నిర్మాణంలో భూనిర్వాసితులకు మంజూరైన నిధులను కొందరు అధికారులు కాజేశారు. సుంకిశాల- కోదండాపూర్ భూనిర్వాసితులకు చెల్లించాల్సిన నష్టపరిహారాన్ని ఫోర్జరీ సంతకాలతో దోచినట్లుగానే ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వ 9, డిస్ర్టీబ్యూటరీ కాల్వ 8,9కి అనుసంధానంగా నిర్మించిన 15ఆర్ మైనర్ల నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు దక్కాల్సిన నిధులను స్వాహా చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. రెండు ప్రాజెక్టులకు సంబంధించి భూనిర్వాసితుల పరిహారాన్ని ఫోర్జరీ సంతకాలతో కాజేసిన వ్యవహారంలో ఓ రెవెన్యూ అధికారి కీలకపాత్ర వహించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. (ఆంధ్రజ్యోతి-మిర్యాలగూడ)
ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు(ఏఎమ్మా ర్పీ) ప్రధాన కాల్వ 9కి అనుసంధానంగా మైన ర్ కాల్వలను నిర్మించడానికి 2007 అక్టోబరు లో ప్రభుత్వం భూసేకరణ చేపట్టింది. డిస్ర్టిబ్యూటరీ 8,9 లకు పర్వేదుల వద్ద నుంచి నాటి చలకుర్తి గ్రామపంచాయతీ మల్లోరికుంట తం డా వరకు సుమారు 2 కి.మీ మేర 15 ఆర్ మైనర్ కాల్వ ఏర్పాటు చేసేందుకు 44 మంది రైతుల నుంచి భూమిని సేకరించింది. ఇం దు కు ఎకరానికి రూ.80 వేల చొప్పున పరిహారం ప్రకటించింది. భూనిర్వాసితులకు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు పేరున ఏఎమ్మారీ యూనిట్ 11 నల్లగొండ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (ల్యాం డ్ అక్విజేషన్) చెక్కులను జారీ చేశారు. అయి తే సంఘమిత్ర కో-ఆపరేటివ్ బ్యాంకు నల్లగొండలో లబ్ధ్దిదారుల ఖాతాలు తెరిపించి ఏజెంట్ అవతారం ఎత్తిన అధికారి నిఽధులు డ్రాచేసి తన కమీషన్ కట్ చేసుకుని కొందరికీ పరిహారం అందజేయగా మరికొందరి లబ్ధ్దిదారులకు తెలియకుండా ఫోర్జరీ సంతకాలతో లక్షలు కాజేసినట్లు సమాచారం.
ఆయనే కీలకం
భూపరిహారాన్ని నిర్వాసితులకు అందకుండా కాజేసినవారిలో ఓ పంచాయతీ అధికారే కీలకమని బాధితులు ఆరోపిస్తున్నారు. పర్వేదుల గ్రా మానికి చెందిన అధికారి అనారోగ్యానికి గురై విధులు నిర్వహించలేని స్థితిలో ఆయన కుమారుడు అనాధికారికంగా అన్నిసర్టిఫికెట్ల పై, రిజిష్టర్లలో తండ్రి సంతకాలు తానే ఫోర్జరీ చేస్తూ అక్రమాలకు తెర లేపినట్లు బాధితులు వాపోతున్నారు. అనతికాలంలో తండ్రి ఉద్యోగం లో నియమాకమై పదోన్నతి పొంది ప్రస్తుతం సొంత మండలంలోనే రెవెన్యూ శాఖలో అధికారిగా విధులు నిర్వహిస్తుండగా, చిన్న ఉద్యోగంతోనే కోట్లలో ఆస్తులను కూడబెట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఆరుగురు లబ్ధ్దిదారులకు అందని పరిహారం
తమకు పరిహారం అందలేదని సంబంధిత భూనిర్వాసితులు నల్లగొండ సంఘమిత్ర సహకార బ్యాంకులో తమకు జారీ చేసినట్లు చెబుతున్న చెక్కుల గురించి వివరాలు అడిగితే బ్యాంకు అధికారులు ఏ సమాచారం ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. పర్వేదులకు చెం దిన మేరేడ్డి జైపాల్‌రెడ్డి(2 ఎకరాలు) అతడి సోదరుడి కుమారుడు సాయిశరత్‌రెడ్డి(ఎకరం) స్థానికంగా లేనప్పటికీ అన్ని రికార్డుల్లో వారి సంతకాలను ఫోర్జరీ చేసి వారి పేరున 80, 91, 92, 93 గల 3 ఎకరాల10 గుంటల భూమి, అందులోని 127 బత్తాయి చెట్లుకు జైపాల్‌రెడ్డి ఒక్కరి పేరున రూ. 3,05,221 మంజూరు చేసినట్లు చూపి ఫోర్జరీ సంతకాలతో కాజేసినట్లు ఆరోపించారు. మరో 5గురికి లక్షల్లో అందాల్సిన పరిహారాన్ని మింగేసినట్లు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి బ్యాంకు అధికారులను చెక్కుల డ్రా కు సంబంధించి సంబం ధిత లబ్ధిదారులు వివరాలు అడిగితే బ్యాంకు అధికారులు సాకులు చెబుతూ దాటవేస్తున్నారని అంటున్నారు.
ఫోర్జరీ సంతకాలతో నిధులు కాజేశారు
నా భూమి 2 ఎకరాలు, మా సోదరుడి కుమారుడిది ఎకరం 10 గుంటలు మైనర్‌కాల్వ నిర్మాణంలో పోతుండడంతో ప్రభుత్వం పరిహారం కింద రూ.3.05 లక్షల పరిహారం ప్రకటించింది. మా కుటుంబం ఊర్లో లేని కాలంలో మా సంతకాలను ఫోర్జరీ చేసి పంచాయతీ అధికారి కాజేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాను.
- మేరెడ్డి జైపాల్‌రెడ్డి, పెద్దవూర
కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నాం
పరిహారం నిధులు కాజేసిన విషయమై బాధితుల నుంచి ఫిర్యాదు అందింది. పెద్దవూర పోలీ్‌సస్టేషన్‌లో కేసు నమోదు చేసి విచారణ సాగిస్తున్నాం.
- శ్రీనునాయక్, సీఐ, నాగార్జునసాగర్
Updated Date - Apr 18 , 2025 | 12:18 AM