నక్సలైట్లను కాల్చివేయడం హేయం
ABN, Publish Date - Jun 16 , 2025 | 12:38 AM
కేంద్రంలోని బీజేపీ ఆపరేషన్ కగార్ పేరుతో నక్సలైట్లను కాల్చివేయడం హేయమైన చర్య అని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి యానాల దామోదర్‌రెడ్డి అన్నారు. ఆదివారం భూదాన్‌పోచంపల్లిలో సీపీఐ పట్టణ ద్వితీయ మహాసభలో మాట్లాడారు.
సీపీఐ జిల్లా సహాయకార్యదర్శి యానాల దామోదర్‌రెడ్డి
భూదాన్‌పోచంపల్లి, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలోని బీజేపీ ఆపరేషన్ కగార్ పేరుతో నక్సలైట్లను కాల్చివేయడం హేయమైన చర్య అని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి యానాల దామోదర్‌రెడ్డి అన్నారు. ఆదివారం భూదాన్‌పోచంపల్లిలో సీపీఐ పట్టణ ద్వితీయ మహాసభలో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్‌చేశారు. వానాకాలం సీజన్ ప్రారంభమైనప్పటికీ రైతు భరోసా నిధులు విడుదల చేయకపోవడం, రైతు రుణమాఫీ పూర్తిస్థాయిలో చేయకపోవడం సరికాదన్నారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయాలని, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెండింగ్ ప్రాజెక్టులకు కావాల్సిన నిధులు మంజూరు చేసి సాగునీటి వనరులు కల్పించాలన్నారు. సీపీఐ పట్టణ మహాసభలో మిర్యాల కృష్ణమూర్తిని రెండోసారి కార్యదర్శిగా, సహాయ కార్యదర్శిగా ముషం శివను మరో 9మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. సమావేశంలో మండల సీపీఐ కార్యదర్శి గోడల్ల నాగభూషణ్, జిల్లా కౌన్సిల్ సభ్యులక పబ్బు యాదయ్య, మాజీ మండల కార్యదర్శి బీమగోని నర్సింహ, ముసునూరి రాములు, పాల్గొన్నారు.
Updated Date - Jun 16 , 2025 | 12:38 AM