ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బుద్ధవనం.. అసంపూర్ణం!

ABN, Publish Date - May 18 , 2025 | 12:09 AM

ప్రపంచ ప్రసిద్ధ బౌద్ధ పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో నాగార్జునసాగర్‌ వద్ద చేపట్టిన బుద్ధవనం ప్రాజెక్టు అసంపూర్ణంగా మిగిలింది. రెండు దశాబ్దాల క్రితం పునాదిరాయి వేసిన ఈ పథకం కిం ద ఇప్పటివరకు పూర్తయిన నిర్మాణాలు, పనులతో పర్యాటక సందడి కనిపిస్తు న్నా, ఇంకా కీలకమైన పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి.

ప్రపంచ ప్రసిద్ధ ప్రాజెక్టు పనుల్లో జాప్యం

రెండు దశాబ్దాల్లో సగం మేర పూర్తి

ప్రాజెక్టు పూర్తయితే అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక క్షేత్రంగా విరాజిల్లే అవకాశం

రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని సూచనలు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి- నల్లగొండ): ప్రపంచ ప్రసిద్ధ బౌద్ధ పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో నాగార్జునసాగర్‌ వద్ద చేపట్టిన బుద్ధవనం ప్రాజెక్టు అసంపూర్ణంగా మిగిలింది. రెండు దశాబ్దాల క్రితం పునాదిరాయి వేసిన ఈ పథకం కిం ద ఇప్పటివరకు పూర్తయిన నిర్మాణాలు, పనులతో పర్యాటక సందడి కనిపిస్తు న్నా, ఇంకా కీలకమైన పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి. నిధుల కొరతతో పాటు అంతర్జాతీయ బౌద్ధ సమాజం నుంచి అవసరమైన మేర మద్దతు, తో డ్పాడును కూడగట్టలేకపోవడంతో పెండింగ్‌ పనులకు మోక్షం కలగడం లేదు.

బుద్ధు ని పుట్టుక నుంచి నిర్యాణం వరకు ప్రతీ ఘట్టాన్ని తెలియజేసేలా సాగర్‌లో స్మారక నిర్మాణాలు చేపట్టాలి. వనాలు నిర్మించడంతోపాటు బుద్ధిజం విశేషాలను తెలియజేసేలా ఏర్పాట్లు చేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఈ ప్రాజెక్టుపై దృష్టి సారించి పెండింగ్‌లో ఉన్న పనులన్నింటినీ పూర్తి చేసేందుకు చొరవ తీసుకోవాలనిపలువురు బుద్ధిస్టులు కోరుతున్నారు.

కీలక నిర్మాణాలకు ముందుకు పడని అడుగు

ప్రపంచ ప్రసిద్ధ క్షేత్రంగా రూపొందించాలని భావిస్తున్న బుద్ధవనంలో బౌద్ధ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని, ఇందుకోసం సాగర్‌ రిజర్వాయర్‌ బ్యాక్‌ వాటర్‌ను ఆనుకుని ఉన్న సుమారు వంద ఎకరాల వరకు భూమిని ఇవ్వాలని నిర్ణయించారు. బౌద్ధ ప్రత్యేకతలు, ఆయుర్వేదం, కళలు, సం స్కృతి తదితర అన్ని అంశాలను ఇక్కడ బోధించాలని, అం దుకు అవసరమైన రీతిలో యూనివర్సిటీని ప్రపంచ బౌద్ధ సంస్థలతో కలిసి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయి తే ఇప్పటివరకు పలు దేశాలకు చె ందిన బుద్ధిస్టులు ఇక్కడ కు వచ్చి చూసి వెళ్తున్నారే తప్ప యూనివర్సిటీ ఏర్పాటులో కదలిక రాలేదు. రాష్ట్ర ప్రభుత్వమే ఇందుకోసం ప్రత్యేకంగా చర్యలు చేపడితే తప్ప యూనివర్సిటీ ఏర్పాటుకు ముందడుగు పడదని స్పష్టమవుతోంది. అదేవిధంగా ఇక్కడ నిర్మించతలపెట్టిన ఆసుపత్రి, త్రీస్టార్‌ హోటల్‌ తదితర నిర్మాణాలకు కూడా ఇంకా ఎలాంటి ప్రతిపాదనలు సిద్ధం కాలేదు. ప్రధానంగా ఇక్కడ ప్రస్తుతం ఆరు కాటేజీలు మాత్రమే ఉం డటంతో ఇక్కడకు వచ్చే పర్యాటకులకు ఉండటానికి సరైన వసతి సదుపాయాలు లేని పరిస్థితి కొనసాగుతోంది. ఇక్కడ త్రీస్టార్‌ హోటల్‌ నిర్మిస్తే బౌద్ధ పర్యాటకులకు అనువుగా ఉంటుందనే సూచనలు వస్తున్నాయి. ఇందుకోసం ఇక్కడ 15 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించారు. రామచంద్రమిషన్‌ తరుపున ఈ హోటల్‌ నిర్మించడానికి కసరత్తు జరిగినా కార్యాచరణ అమలులోకి రాలేదు. బుద్ధవనం ప్రాజెక్టు వద్ద ప్రధాన రోడ్డుకు ఆనుకుని 16 దుకాణాలతో రూ.1.60 కోట్లతో నిర్మిస్తోన్న దుకాణ సముదాయం కూడా అసంపూర్తిగానే నిలిచింది. కాంట్రాక్టర్‌కు బిల్లులు పెండింగ్‌ ఉండటంతో పనులు ఆగినట్లు చెబుతున్నారు. బుద్ధవనంలో పైన పేర్కొన్న కీలకమైన పనులకు ప్రభుత్వం చొరవ తీసుకుని నిధులతో పాటు, ఆయా సంస్థలు వచ్చేలా కృషి చేస్తే బుద్ధవనం ఏర్పాటు లక్ష్యం నెరవేరుతుందనే అభిప్రాయాన్ని పలువురు బుద్ధిస్టులు వ్యక్తం చేశారు.

ఇతర దేశాలకు భూములు కేటాయించినా ..

బౌద్ధమతం అవలంబించే శ్రీలంక, టిబెట్‌, అమెరికా, నేపాల్‌ తదితర దేశాలకు ఇక్కడ అయిదేసి ఎకరాల చొప్పున భూమి కేటాయించారు. ఆయా దేశాల బౌద్ధ సంస్థలు, పర్యాటక సంస్థలు తమ దేశాల్లోని బౌద్ధం విశేషాలను, ప్రత్యేకతలను ప్రతిబింబించే నిర్మాణాలు చేపట్టడం ద్వారా ఈ క్షేత్రానికి అంతర్జాతీయ ప్రాధాన్యం వస్తుందని భావించారు. ఆయాదేశాల ప్రతినిధులు ఈ ప్రాంతాన్ని సందర్శించి సంతోషం వ్యక్తం చేసినా తమ తరుపున ఇక్కడ నిర్మాణాలేవీ ఇంతవరకు చేపట్టలేదు. ఇందుకోసం ఆయా సంస్థలు, దేశాల ప్రతినిధులను ఇక్కడికి రప్పించేందుకు అవసరమైన చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సి ఉంది. వారితో సంప్రదింపులు జరపాల్సి ఉందని ఈ ప్రక్రియను తక్షణం చేపట్టి ముందుకెళితేనే ఆయా దేశాల తరుపున ఇక్కడ నిర్మాణాలు చేపడతారని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాల్సి ఉందని చెబుతున్నారు.

ప్రశాంతతకు నెలవుగా బుద్ధవనం..

నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌ ప్రాజెక్టును ఆనుకుని 270 ఎకరాల్లో నిర్మించ తలపెట్టిన బుద్ధవనం ప్రాజెక్టు ప్రశాంతతకు కేంద్రంగా మారనుంది. బుద్ధుని జననం నుం చి నిర్యాణం వరకు ప్రతీ ఘట్టాన్ని ఇక్కడ వనాల రూపంలో, స్మారక స్థూపాల రూపంలో, నిర్మాణాల రూపంలో ఏర్పాటు చేస్తున్నారు. 2016లో చేపట్టిన ఈ ప్రాజెక్టులో ఇప్పటివరకు ఎంట్రన్స్‌ ప్లాజా, ఫుడ్‌ కోర్టులు, ఆరు కాటేజీలు, బుద్ధ జీవితవనం, జాతకవనం, ధ్యానవనం, స్థూపవనం, మహాస్థూపం నిర్మాణాలు పూర్తయ్యాయి. 21మీటర్ల ఎత్తు, 42మీటర్ల వ్యాసంతో మహాస్థూపాన్ని నిర్మించారు. బుద్ధుని అష్టాంగమార్గాలకు గుర్తుగా దీంట్లో ఎనిమిది భాగాలు ఏర్పాటు చేశారు. ఇందులోనే మ్యూజియం, ఆడిటోరియం, లైబ్రరీ ఉన్నాయి. స్థూపం డ్రమ్‌, డోమ్‌ భాగాలపై క్లిష్టమైన శిల్పాలు చెక్కారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఉండే 13 రకాల బౌద్ధ స్థూపాలను ఇక్కడ కూడా ఏర్పాటు చేశారు. వీటికోసం దాదాపుగా రూ.85 కోట్ల నిధులు వెచ్చించారు. ప్రస్తుతం రూ.25కోట్ల అంచనావ్యయంతో డిజిటల్‌ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ను నిర్మిస్తున్నారు. ఇందులో డిజిటల్‌ లైబ్రరీ, మ్యూజియం ఏర్పాటు చేస్తారు. బుద్ధునికి సంబంధించిన 2500 పైచిలుకు జీవిత చిత్రాలను డిజిటలైజ్‌ చేసి ఇక్కడ పర్యాటకులకు ప్రదర్శిస్తారు. ప్రస్తుతం నిర్మించిన వనాలు, స్థూపాలు, మహాస్థూపంతో పర్యాటకులు వస్తున్నా ఇంకా కీలకమైన నిర్మాణాలు జరగకపోవడం, వచ్చే పర్యాటకులు ఉండేందుకు అవసరమైన వనరులు, సదుపాయాల కల్పనకు శాశ్వత ఏర్పాట్లు లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోందని, ఇక్కడ పెండింగ్‌లో ఉన్న పనులన్నింటినీ పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని, ప్రత్యేకదృష్టితో ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని బుద్ధిస్టులు పలువురు ‘ఆంధ్రజ్యో’తికి తెలిపారు.

Updated Date - May 18 , 2025 | 12:09 AM