ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బోనం ఎత్తిన భువనగిరి

ABN, Publish Date - Jul 13 , 2025 | 11:49 PM

ఆషాఢ మాసం అంటే బోనాల మ హోత్సవాలకు ప్రత్యేకం. ఆదివారం భువనగిరి జిల్లాకేంద్రంలో బోనాల పండు గను ఘనంగా నిర్వహించారు. భువనగిరి కుమ్మరివాడలో మహిళలు డప్పుచప్పుల్లు, పోతరాజు విన్యాసాలతో బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్లారు.

భువనగిరి గంజ్‌, జూలై 13 (ఆంధ్రజ్యోతి): ఆషాఢ మాసం అంటే బోనాల మ హోత్సవాలకు ప్రత్యేకం. ఆదివారం భువనగిరి జిల్లాకేంద్రంలో బోనాల పండు గను ఘనంగా నిర్వహించారు. భువనగిరి కుమ్మరివాడలో మహిళలు డప్పుచప్పుల్లు, పోతరాజు విన్యాసాలతో బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్లారు. గ్రామదేవత పోచమ్మతల్లికి నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించు కున్నారు. సకాలంలో వర్షాలు కురిసి, పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. బోనాల ఊరేగింపులో మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో తాడూరి భిక్షపతి, ఎనబోయిన ఆంజనేయులు, రచ్చశ్రీనివా్‌సరెడ్డి, బర్రె జహంగీర్‌, తంగళ్లపల్లి రవికుమార్‌, రత్నపురం బలరాం, రఘునందన్‌, తాడేం రాజశేఖర్‌, లక్ష్మణ్‌, ర్యాకల శ్రీనివాస్‌, అశోక్‌, సుభాష్‌, సురేష్‌, ని తీష్‌,సూరజ్‌, సంతోష్‌,శ్రీను,చంద్రయ్య, బాలసత్తయ్య, బాలశంకర్‌, కిష్టయ్య పాల్గొన్నారు.

భూదాన్‌పోచంపల్లి: పట్టణంలోని మాధవనగర్‌ కాలనీలో పెద్దమ్మతల్లి బోనాల జాత ర ఆదివారం వైభవంగా సాగింది. ఈ సందర్భంగా ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజ లు నిర్వహించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. పోచంపల్లి అర్బన్‌ బ్యాంకు చైర్మన్‌ తడక రమేష్‌, మాజీ కౌన్సిలర్లు గుండు మధు, బోగ భానుమతి విష్ణు హాజరై అమ్మవారికి పూజలు నిర్వహించారు. సాయంత్రం మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించి, పెద్దమ్మతల్లికి నైవేద్యం సమర్పించారు. ఉత్సవాల్లో బోగ గణేష్‌, కోడి చంద్రశేఖర్‌, కోటి నాగులు, ముషం గోవర్ధన్‌, అందెకోటి వెంకటేష్‌, యంబ యాదగిరి, బోగ కుమార్‌, బిట్ల గణేష్‌, అందెకోటి ధనరాజ్‌, బాలరత్నం, పాల్గొన్నారు.

Updated Date - Jul 13 , 2025 | 11:49 PM