ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

లబ్ధిదారులే నిర్మాణ కర్తలు

ABN, Publish Date - Jun 18 , 2025 | 12:05 AM

అసంపూర్తిగా నిలిచిన డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లను లబ్ధిదారు నేతృత్వంలో బీఎల్‌సీ (బెనిఫీషియరీ లెడ్‌ కన్‌స్ట్రక్షన్‌) పద్ధతిలో పూర్తిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అందుకోసం తొలుత ఇళ్లకు లబ్ధిదారుల ను ఎంపిక చేయనున్నారు.

వారే నిర్మించుకునేలా నూతన విధానం

ఒక్కో ఇంటికి గరిష్ఠంగా రూ.5లక్షలు

లబ్ధిదారులను త్వరగా ఎంపికచేయాలని మంత్రి ఆదేశం

ఆశావహులఎదురుచూపు

(ఆంధ్రజ్యోతిప్రతినిధి,నల్లగొండ) : అసంపూర్తిగా నిలిచిన డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లను లబ్ధిదారు నేతృత్వంలో బీఎల్‌సీ (బెనిఫీషియరీ లెడ్‌ కన్‌స్ట్రక్షన్‌) పద్ధతిలో పూర్తిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అందుకోసం తొలుత ఇళ్లకు లబ్ధిదారుల ను ఎంపిక చేయనున్నారు. ఒక్కో ఇంటికి రూ.5లక్షల వరకు గరిష్ఠంగా నిధులు కేటాయిస్తూ పెండింగ్‌ పనులను ఈ విధానంలో పూర్తిచేయాలని నిర్ణయించారు.

గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి నేతృత్వంలో సోమవారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లపై ప్రభుత్వం స్పష్టతకు వచ్చింది. బీఎల్‌సీ విధానం ప్రవేశపెట్టడం ద్వారా దాదాపు ఏడాదిన్నరకాలంగా పెండింగ్‌లో ఉన్న డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లపై అధికారులకు దిశానిర్దేశం చేసింది. వీలైనంతవేగంగా తొలుత లబ్ధిదారులను ఎంపిక చేయాలని మంత్రి ఆదేశించడంతో ఆ మేరకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాల్సి ఉంది. స్థానికసంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న తరుణంలో కీలకమైన డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వాలని నిర్ణయించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

అందుబాటులో 4,716 డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లు

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు 20వేల ఇళ్లను మంజూరు చేయగా, వాటిల్లో కేవలం 6,360 ఇళ్లు మాత్రమే నిర్మించారు. నిర్మించిన ఇళ్లల్లోనూ ఎన్నికల సమయానికి కేవలం 1,644 మంది లబ్ధిదారులకు మాత్రమే కేటాయించారు. మరో 4,716 ఇళ్లు అర్హులకు కేటాయించకపోవడం, వాటికోసం ఎన్నికల షెడ్యూల్‌ వచ్చేంతవరకు లబ్ధిదారుల ఎంపికపై అప్పటి ఎమ్మెల్యే లు సందిగ్ధంలో ఉండటంతో చివరికి ఇళ్లను ఎవ్వరికీ కేటాయించలేకపోయారు. ఆ ఇళ్లల్లో ప్రస్తు తం ఎవ్వరూ నివాసం ఉండకపోవడంతో క్రమంగా అవి శిథిలమవుతున్న పరిస్థితికి ఏర్పడింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 4,716 ఇళ్లు ప్రస్తుతం నిర్మించి అందుబాటులో ఉన్నాయి. వీటిలో అత్యధికంగా సూర్యాపేట నియోజకవర్గంలో 1,358 ఇళ్లు, నల్లగొండలో 710, మిర్యాలగూడలో 640, కోదాడలో 560, భువనగిరిలో 641, తుంగతుర్తి 211, నకిరేకల్‌లో 534తోపాటు ఆలేరులో ఇళ్లు లబ్ధిదారులకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. వీటితో పాటు మరో 2వేలపైచిలుకు ఇళ్లుఅసంపూర్తిగా ఉన్నా యి. 70శాతం ఇళ్ల నిర్మాణాలు పూర్తయిన 4,716 ఇళ్లతో పాటు, బేస్‌మెంట్‌, లెంటల్‌ స్థాయికి వచ్చిన మరో 2వేల ఇళ్లకు కలిపి బీఎల్‌సీ పద్ధతిలో నిర్మాణాలను పూర్తిచేసేందుకు తాజా నిర్ణయంతో వెసులుబాటు కలిగినట్లయింది. ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయడంతో పాటు, ఇళ్లు నిర్మించిన కాలనీల్లోనూ పూర్తిస్థాయిలో రోడ్లు, విద్యుత్‌ సదుపాయాలు, తాగునీటి పైప్‌లైన్లు, డ్రైనేజీల నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. తక్షణమే లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేసి, మౌలిక వసతులు కల్పించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. స్థానిక ఎన్నికలలోపు లబ్ధిదారులకు పట్టాలు అందజేస్తారనే అశాభావం వ్యక్తమవుతోంది.

లబ్ధిదారుల ఎంపికపై ఉత్కంఠ

డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో నల్లగొండ, సూర్యాపేట, తుంగతుర్తి తదితర ప్రాంతాల్లో అప్పటి ప్రభుత్వ హయాంలో లబ్ధిదారులను డ్రా విధానంలో ఎంపిక చేశారు. అయితే ఇళ్ల నిర్మాణాలు పూర్తికాకపోవడం, మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ఆ లబ్ధిదారులకు అందించలేకపోయారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం బీఎల్‌సీ విధానంలో డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లను పూర్తి చేయాలని సంకల్పించిన నేపథ్యంలో గత లబ్ధిదారులకే ఇస్తారా? లేక కొత్తగా లబ్ధిదారులను ఎంపికచేస్తారా? అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. తమకే ఇళ్లను అందజేయాలని గత లబ్ధిదారులు ధర్నాలు, ఆందోళనలు చేసిన పరిస్థితి కొనసాగింది. తాజాగా, వీటిపై ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల మేరకు లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు దీనిపై ఎలాంటి ఆదేశాలు రాలేదని, ఉన్న నిధులతో కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని హౌసింగ్‌ అధికారులు పేర్కొంటున్నారు.

Updated Date - Jun 18 , 2025 | 12:05 AM