ఏటీఎం చోరీ హరియాణా దొంగల పనే
ABN, Publish Date - Jun 03 , 2025 | 12:11 AM
: హుజూర్‌నగర్ పట్టణంలోని ఎస్‌బీఐ ఏటీఎంలో చోరీ చేసిందని హరియాణా దొంగలేనని ఎస్పీ నర్సింహ అన్నారు. సోమవారం పట్టణం లో నగదు చోరీ అయిన ఎస్‌బీఐ ఏటీఎంను ఎస్పీ పరి శీలించారు.
హుజూర్‌నగర్ , జూన్ 2 (ఆంధ్రజ్యోతి) : హుజూర్‌నగర్ పట్టణంలోని ఎస్‌బీఐ ఏటీఎంలో చోరీ చేసిందని హరియాణా దొంగలేనని ఎస్పీ నర్సింహ అన్నారు. సోమవారం పట్టణం లో నగదు చోరీ అయిన ఎస్‌బీఐ ఏటీఎంను ఎస్పీ పరి శీలించారు. అనంతరం హుజూర్‌నగర్ పోలీ్‌సస్టేషన్‌లో విలేకరులతో మాట్లాడారు. ఈ చోరీలో నలుగురుపాల్గొన్నట్లు ప్రాథమిక సమాచారం లభించిందన్నారు. ఇతర రాషా్ట్రల నుంచి దొంగలువచ్చి ఇలాంటి చోరీలకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో గతంలో ఇటువంటి ఘటనలు జరిగాయన్నారు. చోరీపై పూర్తి విచారణ చేస్తున్నామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. రాష్ట్రంలో దొంగతనాల సంఖ్య తగ్గుతుందని, సైబర్ నేరాలు పెరుగుతున్నాయని అన్నారు. వాణిజ్య సముదాయాలు, పబ్లిక్ సర్వీస్ సెక్టార్లు, అపార్ట్‌మెంట్లు, ప్రధాన కూడళ్లు, ముఖ్యమైన ప్రాంతాలు, వ్యాపార కేంద్రాలు, షాపింగ్ మాల్స్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. కొత్త వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. నేరాల నియంత్రణ ప్రజల చేతుల్లోనే ఉందన్నారు. హుజూర్‌నగర్ ప్రాంతానికి సంబంధించి వచ్చిపోయే మార్గాల్లో సీసీ పుటేజీ స్పష్టంగా కనిపించేలా సీసీ కెమెరాలు ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏటీఎం చోరీకి సంబంధించి జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో గాలిస్తున్నామన్నారు. పాత నేరస్థులపై నిఘా పెట్టామన్నారు. గత నెలలో ఏటీఎంల వద్ద సెక్యూరిటీ ఏర్పాటుచేసుకోవాలని బ్యాంక్ అధికారులకు నోటీసులు జారీ చేసినా పట్టించుకోలేదన్నారు. బ్యాంక్ ఏటీ ఎం చోరీ చేసిన నిందితులు 10 నిమిషాల్లోనే పని ముగించు కు వెళ్లారన్నారు. ఏటీఎంలో అలికిడిని పసిగట్టిన ఓ వ్యక్తి 15 నిమిషాల తర్వాత ఇచ్చిన సమాచారం మేరకు ఏటీఎం వద్దకు పోలీసులు వెళ్లారన్నారు. అప్పటికే దొంగలు ఏటీఎంలో చోరీ చేసి వెళ్లారన్నారు.నిందితులను పట్టుకునేందుకు మూడు బృందాలను ఏర్పాటుచేశామన్నారు. ఆయన వెంట సీఐ చరమందరాజు, ఏఎ్‌సఐ బలరామిరెడ్డి, రమేష్, వెంకన్న, కాశి వెంకటనారాయణ పాల్గొన్నారు.
Updated Date - Jun 03 , 2025 | 12:11 AM