ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అడుగంటుతున్న.. భూగర్భజలాలు

ABN, Publish Date - Aug 04 , 2025 | 12:50 AM

జిల్లాలో మోస్తారు వర్షాలు మాత్ర మే కురిశాయి. కనీసం మెట్ట పంటల కు కూడా పూర్తి స్థాయిలో కలిసిరాని పరిస్థితి. భారీగా వర్షాలు కురవకపోవడంతో చెరువులు, కుంటల్లోకి నీరు చేరలేదు. దీంతో జిల్లావ్యాప్తంగా భూ గర్భజలాలు గణనీయంగా అడుగంటుతున్నాయి.

(ఆంధ్రజ్యోతి-నల్లగొండ): జిల్లాలో మోస్తారు వర్షాలు మాత్ర మే కురిశాయి. కనీసం మెట్ట పంటల కు కూడా పూర్తి స్థాయిలో కలిసిరాని పరిస్థితి. భారీగా వర్షాలు కురవకపోవడంతో చెరువులు, కుంటల్లోకి నీరు చేరలేదు. దీంతో జిల్లావ్యాప్తంగా భూ గర్భజలాలు గణనీయంగా అడుగంటుతున్నాయి. గత ఏడాదితో పోలీస్తే ఈసారి నీటిమట్టం కాస్తా పైకి ఉన్నప్పటికీ ఎలాంటి ఉపయోగం లేదు.

గతేడాది జిల్లాలో జూలై 19.96 మీటర్లల లో తులో భూగర్భజల మట్టం ఉండగా, ఈ సారి 24.20 మీటర్ల లోతులో నీటి మట్టం ఉంది, నల్లగొండ జిల్లాలో జూలై 31 నాటికి 9.54మీటర్ల లో తులో ఉండగా, ఈ సారి 8.85మీటర్ల లోతులో నీటిమట్టం ఉంది. గతేడాదితో పోలిస్తే జిల్లాలో నీటిమట్టం భారీగానే పడిపోయింది. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడిచినా, సమృద్ధిగా వర్షాలు కురవకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో అత్యధిక శాతం రైతులు బోరుబావులపైనే ఆధారపడి జీవిస్తున్నారు. మెట్ట ప్రాంతంలో భూగర్భజలాలు అడుగంటడంతో బోర్లు పోయడంలేదు. చాలా ప్రాం తాల్లో రైతులు నారుమడులు సిద్ధం చేసుకున్నా, పొలాలు తడవక పోవడంతో సరైన సమయం లో నాటు వేయని పరిస్థితి నెలకొంది. చెరువు లు, కుంటల్లో నీరు ఇంకిపోవడంతో బోర్లు కూ డా ఆగి పోస్తున్నాయి. జిల్లాలో రోజురోజుకూ భూగర్భజలాలు వేగంగా పడిపోతున్నాయి. చా లాచోట్ల బోర్లు వేసినా, నీరుపడక రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. పంటలు ఎండిపోవడం తో రైతులు ఎదురు చూస్తున్నారు.

జూలైలో 24.20 మీటర్ల లోతులో భూగర్భజలాలు

అధికారుల లెక్కల ప్రకారం సూర్యాపేట జిల్లాలో 24.20 మీటర్ల లోతునకు భూగర్భజలా లు పడిపోయాయి. నల్లగొండ జిల్లాలో జూలై 31నాటికి 8.85 మీటర్ల లోతుకు భూగర్భజలాలు పడిపోయాయి. వర్షాలు లేక పోవడమే ఈ పరిస్థితికి కారణమని పేర్కొంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో 24.20 మీటర్ల లోతులో నీరు ఉండటం తో బోరు బావులపై తీవ్ర ప్రభావం కనిపిస్తుం ది. భారీ వర్షాలు నమోదు కాకపోవడంతో చెరువులు, కుంటలు వెలవెలబోతున్నాయి. వర్షాలపైనే ఆధారపడి ఉన్న ప్రాంతాల్లో మాత్రం చెరువులు, కుంటలోకి నీరు రాలేదు. దీంతో రాబోయే రోజుల్లో చెరువుల కింద ఉన్న ప్రాంతాల్లో బోర్ల కు నీరు వచ్చే పరిస్థితి కానరావడంలేదు. వర్షపాతం లెక్కలు సైతం గందరగోళంగా ఉన్నా యి. గ్రామాలవారీగా లెక్కలు లేకపోవడంతో మండలాలు యూనిట్‌గా వర్షాల లెక్కలు వేయ డం వల్ల సమస్యలు ఎదురవుతున్నాయి. చాలా మండలాల్లో అత్యధిక వర్షపాతాలు నమోదైనట్లు లెక్కలు చూపిస్తుండగా క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితి కానరావడం లేదు.

వెలవెలబోతున్న చెరువులు, కుంటలు

జిల్లావ్యాప్తంగా వందలాది చెరువులు నీళ్లు లేకపోవడంతో భూగర్భజలాలు అడుగంటి పోయాయి. సమృద్ధిగా వర్షాలు లేకపోవడంతో ఈ సంవత్సరం పరిస్థితి దారుణంగా తయారైంది. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కురిసే వర్షాలపైనే భూగర్భజలాల పరిస్థితి ఆధారపడి ఉంది. అయితే ప్రస్తుతం వాతావరణం చూస్తుంటే ఎండ తీవ్రత అధికంగా కనిపిస్తుంది. వర్షాలు మాత్రం కురిసే పరిస్థితులు కానరావడంలేదు. జిల్లాలో శనివారం తీవ్ర ఉక్కపోతతో వాతావరణం ఉండగా ఆదివారం గరిష్ఠ ఉష్ణోగ్రత 34.0డిగ్రీలుగా నమోదైంది. వానాకాలంలో ఎండకాలం మాదిరిగా పరిస్థితులు నెలకొన్నాయని చెప్పవచ్చు.

గతేడాదితో పోలిస్తే..:రేవతి,భూగర్భ జలవనరుల శాఖ డీడీ,నల్లగొండ

గత సంవత్సరం జూలైతో పోలిస్తే ఈ సంవత్సరం జూలైలో నీటిమట్టం పైభాగానే ఉంది. గత సంవత్సరం 9.54 మీటర్ల లోతులో ఉండగా ఈ సంవత్సరం 8.85 మీటర్ల లోతులో నీటి మట్టాలు ఉన్నాయి. అయినా నీటిమట్టాలు లోతులో ఉండటంతో భూగర్భజలాలు అడుగంటాయి. వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో నీటిమట్టాలు పడిపోయాయి. వర్షభావ పరిస్థితుల కారణంగా చెరువులోకి నీరు రాలేదు.

Updated Date - Aug 04 , 2025 | 12:50 AM