ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆసిఫ్‌ నెహర్‌ కాల్వ కట్టకు మరమ్మతు చేయాలి

ABN, Publish Date - Jun 19 , 2025 | 12:06 AM

మునిపంపుల గ్రామ పరిధిలో ఆసీఫ్‌ నగర్‌ కాలువ (రాచకాల్వ) శిథిలావస్థకు చేరి అధిక వర్షాలు వస్తే తెగిపోయే ప్రమాదం ఉందని, కట్టకు వెంటనే మరమ్మతులు చేసి పేరుకుపోయిన కంపచెట్లను తొలగించి ముందస్తు చర్యలు చేపట్టాలని సీపీఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం డిమాండ్‌ చేశారు.

రామన్నపేట, జూన 18 (ఆంధ్రజ్యోతి): మునిపంపుల గ్రామ పరిధిలో ఆసీఫ్‌ నగర్‌ కాలువ (రాచకాల్వ) శిథిలావస్థకు చేరి అధిక వర్షాలు వస్తే తెగిపోయే ప్రమాదం ఉందని, కట్టకు వెంటనే మరమ్మతులు చేసి పేరుకుపోయిన కంపచెట్లను తొలగించి ముందస్తు చర్యలు చేపట్టాలని సీపీఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం డిమాండ్‌ చేశారు. బుధవారం సీపీఎం మునిపిపంపుల గ్రామ శాఖ ఆధ్వర్యంలో స్థానిక నాయకులతో కలిసి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం తహసీల్దార్‌ లాల్‌ బహదూర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 100 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆసీఫ్‌ నగర్‌ కాలువ కట్ట పూర్తిగా శిథిలావస్థకు చేరి భారీ వర్షాలు వచ్చినప్పుడు నీటి సామర్థ్యం కట్టమీద పొంగిపోవడంతో సమీపంలో ఉన్న కాలనీల ప్రజలు బిక్కుబ్కిమంటూ కాలం వెల్లదీయాల్సి వస్తోందన్నారు. కట్టపై రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తున్న కంపచెట్లను ఉపాధి హామీ పథకం ద్వారా తొలగించి సమస్య పరిష్కరించాలని అన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు జంపాల అండాలు, తొలుపునూరి శ్రీనివాస్‌, తాళ్లపల్లి జితేందర్‌, పావురాల మత్స్యగిరి, జోగుల శ్రీనివాస్‌, జంపాల ఉమాపతి, బూడిదబిక్షం, గంటెపాక శివకుమార్‌, అప్పం సురేందర్‌, సిరిశాల యాదగిరి, జోగుల సాయికుమార్‌, కానుకుంట్ల ఉపేందర్‌, తుర్కపల్లి నరేష్‌, జంపాల మహేష్‌, ఎడ్ల ధనమ్మ, బొడ్డుపల్లి సంధ్య పాల్గొన్నారు.

Updated Date - Jun 19 , 2025 | 12:06 AM