ఉపాధి ఆధారిత శిక్షణ కోర్సులకు దరఖాస్తులు
ABN, Publish Date - Apr 30 , 2025 | 12:55 AM
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన పోచంపల్లి మండలంలోని జలాల్‌పూర్ గ్రామానికి చెందిన స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థ (ఎస్‌ఆర్‌టీఆర్‌ఐ)లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఆ ధ్వర్యంలో మేధా చారిటబుల్ ట్రస్ట్ సహకా రంతో తెలుగు రాషా్ట్రలకు చెందిన గ్రామీణ నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి ఆ ధారిత సాంకేతిక శిక్షణ కోర్సులకు దరఖా స్తులు ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్ పీఎ్‌సఎస్ ఆర్.లక్ష్మి తెలిపారు.
భూదానపోచంపల్లి, ఏప్రిల్ 29 (ఆంధ్ర జ్యోతి): యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన పోచంపల్లి మండలంలోని జలాల్‌పూర్ గ్రామానికి చెందిన స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థ (ఎస్‌ఆర్‌టీఆర్‌ఐ)లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఆ ధ్వర్యంలో మేధా చారిటబుల్ ట్రస్ట్ సహకా రంతో తెలుగు రాషా్ట్రలకు చెందిన గ్రామీణ నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి ఆ ధారిత సాంకేతిక శిక్షణ కోర్సులకు దరఖా స్తులు ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్ పీఎ్‌సఎస్ ఆర్.లక్ష్మి తెలిపారు. 6నెలల కాలపరిమితి గ ల ఎలకీ్ట్రషియన (డోమెస్టిక్) సోలార్ సిస్టమ్ ఇనస్టాలేషన, సర్వీసెస్ కోర్సుకు ఐటీఐ/ డి ప్లొమా పాసైన వారు అర్హులని తెలిపారు. కంప్యూటర్ హార్డ్‌వేర్, సెల్‌ఫోన, ఎలకా్ట్రనిక్ వ స్తువుల రిపేర్, సీసీటీవీ టెక్నీషియన కోర్సులకు పదో తరగతి పాసైన వారు అర్హులని తెలిపారు. టైలరింగ్, ఎంబ్రాయిడరీ, జర్దోజి, క్విల్ట్ బ్యాగ్స్ మేకింగ్ కోర్సుకు 8వ తరగతి ఉత్తీర్ణులైనవారు అర్హులని తెలిపారు. 18-25 ఏళ్ల మధ్య వయస్సు గల వారై ఉండాలని సూచించారు. ఆసక్తి గల వారు అర్హతల సర్టిఫికెట్లు, జిరాక్స్ సెట్, 2 పాస్‌పోర్టు ఫొటోలు, ఆధార్ కార్డు, ఇనకం స ర్టిఫికెట్లతో స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థలో దరఖాస్తులతోపాటు మే 7న బుధవారం ఉదయం 10 గంటలకు హాజరుకావాలన్నారు. వివరాలకు ఫోన నెంబర్లు 9133908000, 9133908111, 9933908222 లేదా 9948466111 కు సంప్రదించాల్సిందిగా ఆమె తెలిపారు
Updated Date - Apr 30 , 2025 | 12:55 AM