అన్నిశాఖలు అప్రమత్తంగా ఉండాలి
ABN, Publish Date - Jul 22 , 2025 | 12:45 AM
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అన్నిశాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమం త్రి రేవంత్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రభుత్వ సంక్షేమ పఽథకాలు, ప్రజా సంక్షే మం కోసం చేడుతున్న అభివృద్ధి పనులు, రైతుల సమస్యలు, వర్షాలు తదితర అంశాలపై సోమవారం ఆయన కలెక్టర్లతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.
సీజనల్ వ్యాధులపై ముందస్తు చర్యలు తీసుకోవాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డి
భువనగిరి (కలెక్టరేట్), జూలై 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అన్నిశాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమం త్రి రేవంత్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రభుత్వ సంక్షేమ పఽథకాలు, ప్రజా సంక్షే మం కోసం చేడుతున్న అభివృద్ధి పనులు, రైతుల సమస్యలు, వర్షాలు తదితర అంశాలపై సోమవారం ఆయన కలెక్టర్లతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. జూన్ నుంచి ఇప్పటి వరకు 21శాతం వర్షపాతం తక్కువ నమోదైందని, అయినా గత మూ డు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. వాతావరణ శాఖ సూచనలకు అనుగుణంగా కమాండ్ కంట్రోల్ రూం నుంచి సమన్వయం చేసుకొని జాగ్రత్తలు వహించాలన్నారు. ఆయా జిల్లాల్లో పిడుగుపాటుతో జరిగే నష్టాల వివరాలను నమోదు చేయాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పీహెచ్‌సీలతోపాటు, అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎల్లప్పుడూ వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
కలెక్టర్లు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయాలి..
దోమల వ్యాప్తి జరగకుండా శానిటేషన్ నిర్వహించాలని, క్షేత్రస్థాయిలో కలెక్టర్లు తనిఖీలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. రైతులకు యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తున్నట్లు తెలుస్తోందని, సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కరరావు, డీఎంహెచ్‌వో మనోహర్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి రోజారాణి పాల్గొన్నారు.
Updated Date - Jul 22 , 2025 | 12:45 AM