ఆరోగ్యశ్రీలోకి ‘వయోవందనం’
ABN, Publish Date - Jun 17 , 2025 | 12:16 AM
ఉద్యోగ విరమణ చేసిన వారికి ఆరోగ్యశ్రీ సేవలు చేరువకానున్నాయి. 70 ఏళ్లకు పైబడిన వారికి ఆరోగ్యశ్రీలో అర్హత లేక ఇబ్బంది పడేవారు.
రూ.5 లక్షల వరకు ఉచిత సేవలు
ఉద్యోగ విరమణ చేసిన 70 ఏళ్ల పైబడిన వృద్ధులకు అవకాశం
ఉద్యోగ విరమణ చేసిన వారికి ఆరోగ్యశ్రీ సేవలు చేరువకానున్నాయి. 70 ఏళ్లకు పైబడిన వారికి ఆరోగ్యశ్రీలో అర్హత లేక ఇబ్బంది పడేవారు. కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన భారత కిందికి తీసుకువచ్చిన వయోవందన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ హెల్త్‌ట్ర్‌స్టలో చేర్చిం ది. ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 70 ఏళ్లకు పైబడిన వారికి ఆరోగ్యశ్రీకి సంబంధించిన ఆసుపత్రుల్లో రూ.5లక్షల వరకు ఉచిత వైద్యసేవలు అందనున్నాయి. ముఖ్యంగా 70 సంవత్సరాల పైబడిన దారిద్య్రరేఖకు పైబడిన ఆర్థిక స్థోమతకు సంబంధం లేకుండా ఈ పథకం వర్తింపుకానుంది. ఇది ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని వయోవృద్ధులకు వరంగా మారనుంది. ప్రభుత్వ ఉద్యోగులుగా రిటైర్డ్ అయిన వారికి కూడా ఇక రూ. 5లక్షల వరకు వైద్యం ఉచితంగా అందనుంది.
- (ఆంధ్రజ్యోతి-సూర్యాపేట టౌన)
సూర్యాపేట జిల్లాలో 10,99,560 మంది జనా భా ఉంది. ఇందులో 29వేల మంది వరకు 70 ఏళ్ల కు పైబడిన వారూ ఉన్నారు. అదేవిధంగా జిల్లాలో 11ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు ఉన్నాయి.సూర్యాపేట జి ల్లా కేంద్రంలో నాలుగు ఆరోగ్యశ్రీ అమలవుతున్న ఆసుపత్రులు ఉన్నాయి. ఆయా ఆసుపత్రుల్లో వయోవందన పథకం అమలు కానుంది. అయితే 70ఏళ్లకు పైబడినవారు విధిగా ఆధార్‌కార్డు ద్వారా రిజిస్ట్రేషన చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన పూ ర్తయిన మరుక్షణం కార్డు రూపంలో వివరాలతో కూడిన అర్హత నెంబర్ వస్తుంది. ఈ కార్డు ద్వారా ఆరోగ్యశ్రీలో వయోవందన కింద సేవలు పొందవచ్చు.
నెట్‌వర్క్ చాలా బిజీ
వయోవందన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీలో చేర్చడంతో 70 ఏళ్లకు పైబడిన వారు ఆనలైనలో దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా ఆనలైన బిజీగా ఉండ డం లేదా సర్వర్ డౌన అవుతుండటంతో దరఖాస్తుకు ఇబ్బందిగా మారింది. ఆధార్ కార్డు ద్వారా ఆనలైనలో రిజిస్ట్రేషన చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం ఉత్తర్వులు గత నెల విడుదల చేసినా దానికి సంబంధించిన ఆనలైన ప్రక్రి య పూర్తిస్థాయిలో విజయవంతంగా లేదు.దీంతో 70 ఏళ్లకు పైబడిన అర్హులై న వారి ఆశలు ఆవిరవుతున్నాయి. ఇ ప్పటికైనా ఆనలైన ఇబ్బంది లేకుండా చూడాలని వయోవృద్ధులు కోరుతున్నారు.
ఆనలైన ఓపెనకాక ఇబ్బంది పడుతున్నాం
రాష్ట్ర ప్రభుత్వం వయోవందన పథకాన్ని ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్‌లో చేర్చడాన్ని స్వాగతిస్తున్నాం. అయితే ఆనలైన రిజిస్ట్రేషనకు సంబంధించిన సమస్య ఉంది. దీనివల్ల రిజిస్ట్రేషన కావడంలేదు. దీంతో చాలామంది నిరాశ చెందుతున్నారు. ప్రభుత్వం ఆనలైన సమస్య తలెత్తకుండా చూడాలి. ఈ పథకం చాలామందికి ఉపయోగపడుతుంది.
- దండ శ్యాంసుందర్‌రెడ్డి, పెన్షనర్
Updated Date - Jun 17 , 2025 | 12:16 AM