ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఎన్‌సీఎల్‌ పరిశ్రమపై చర్యలు తీసుకోవాలి

ABN, Publish Date - Jun 25 , 2025 | 11:53 PM

మఠంపల్లి, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): నిబంధనలకు విరుద్ధంగా బ్లాస్టింగ్‌కు పాల్పడుతున్న ఎన్‌సీఎల్‌ పరిశ్రమ నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మండలంలోని గుండ్లపల్లి గ్రామస్థులు కోరారు.

మఠంపల్లి, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): నిబంధనలకు విరుద్ధంగా బ్లాస్టింగ్‌కు పాల్పడుతున్న ఎన్‌సీఎల్‌ పరిశ్రమ నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మండలంలోని గుండ్లపల్లి గ్రామస్థులు కోరారు. ఈ మేరకు గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన మహిళలు, గ్రామస్థులు సమీపంలోని క్వారీలో జరుగుతున్న పనులను నిలిపివేసి అక్కడే ఆందోళన, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్థులు మాట్లాడుతూ ఎన్‌సీఎల్‌ పరిశ్రమ యాజమాన్యం ఇష్టానుసారంగా చేపడుతున్న బ్లాస్టింగ్‌తో ఇళ్లు పాక్షికంగా దెబ్బతింటున్నాయని, టీవీలు, ఫ్యాన్లు, ఇతర వస్తువులు పడిపోతున్నాయని ఆరోపించారు. బ్లాస్టింగ్‌ చేయాల్సి సర్వేనెంబరు మార్చి మరో క్వారీని నిర్వహిస్తున్నారని, ఇదేమిటని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. గతంలో బ్లాస్టింగ్‌ తీవ్రతను తగ్గించి, సమీప గ్రామంలో మౌలిక వసతులు కల్పిస్తామని పరిశ్రమ నిర్వాహకులు హామీ ఇచ్చారన్నారు.

కానీ నేటికీ ఆ హామీలు మాటలకే పరిమితం అయ్యిందన్నారు. బ్లాస్టింగ్‌ తీవ్రత విషయాన్ని మండల, జిల్లా అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని, నిబంధనలను పాటించకుండా బ్లాస్టింగ్‌ చేస్తున్న ఎన్‌సీఎల్‌ పరిశ్రమ నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో సామేల్‌, హసన్‌,సైదమ్మ, మరియమ్మ, వెంకటాద్రి, నాగమణి, గురవమ్మ, కుమారి, అరుణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 25 , 2025 | 11:53 PM