ఆర్టీఏ ఏజెంట్లకు ఏసీబీ దడ
ABN, Publish Date - Jul 04 , 2025 | 12:22 AM
ఆర్టీఏ ఏజెంట్లకు ఏసీబీ దడ పట్టుకుంది. నిన్నమొన్నటి వరకు ఆర్టీఏ, ఎంవీఐ కార్యాలయాల్లో వీరిదే హవా. ఏ ఫైల్‌పై సంతకం కావాలన్నా నేరుగా కాకుండా వీరి ద్వారా వెళితేనే పనిజరిగేది.
జిల్లాపై ఏసీబీ దాడుల ప్రభావం
దుకాణాలు బంద్ చేసిన ఏజెంట్లు
కార్యాలయాల్లోకి రానివ్వని అధికారులు
(ఆంధ్రజ్యోతి-సూర్యాపేట): ఆర్టీఏ ఏజెంట్లకు ఏసీబీ దడ పట్టుకుంది. నిన్నమొన్నటి వరకు ఆర్టీఏ, ఎంవీఐ కార్యాలయాల్లో వీరిదే హవా. ఏ ఫైల్‌పై సంతకం కావాలన్నా నేరుగా కాకుండా వీరి ద్వారా వెళితేనే పనిజరిగేది. రోజుల తరబడి తిప్పించుకునే పనులను కూడా ఒక్కరోజులే ఆర్టీఏ ఏజెంట్లు చేసిపెట్టేవారు. అలాంటి పరిస్థితులు కొద్దిరోజులుగా కనిపించడం లేదు. రంగారెడ్డి జిల్లాలో ఏసీబీ దాడులు చేయడంతో ఆ భయం ఇక్కడి అధికారులకు, ఏజెంట్లకు పట్టుకుంది. దీంతో ఏజెంట్లను అధికారులు కార్యాలయాల్లోకి రానివ్వడంలేదు.
రంగారెడ్డి జిల్లాలో ఆర్టీఏ కార్యాలయాలపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. కార్యాలయంతో పాటు ఆర్టీఏ ఏజెంట్‌లపై కూడా దాడులు నిర్వహించారు. వారినీ విచారించారు. ఈ విషయం తెలియడంతో సూర్యాపేట పట్టణం గాంధీనగర్‌లో ఉన్న ఆర్టీఏ కార్యాలయం ఎదుట ఉన్న ఏజెంట్‌లు దుకాణాలు బంద్ చేశారు. అంతేకాక రవాణాశాఖ అధికారులు కూడా ఏజెంట్లను కార్యాలయంలోకి అనుమతించడంలేదు. జిల్లాకేంద్రంలోని ఆర్టీవో కా ర్యాలయం వద్ద దాదాపు 20మంది ఆర్టీఏ ఏజెంట్లు ఉన్నారు. కోదాడలో ఎంవీఐ కార్యాలయం వద్ద 15 మందిదాకా ఏజెంట్లు ఉన్నారు. నిన్నటివరకు అన్నిపనులు చక్కబెట్టిన ఏజెంట్లు లేకపోవడంతో వారి తో పనులు చేయించుకోవడం అలవాటైన ప్రజల కూ ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా చదువురాని గ్రామీణులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. రిజిస్ట్రేష న్లు, లైసెన్సుల కోసం మీసేవా కేంద్రాల్లో ఫీజు చెల్లించాలి. అంతేకాక కొన్ని ఫాంలు సొంతంగా నిం పాలి. ఇవి నింపడం వారికి మామూలు వారికి ఇబ్బందిగానే ఉంటుంది. నేరుగా కార్యాలయానికి వెళితే అవి అవీ లేవంటూ కొర్రీలు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఏజెంట్లు ఉంటే అంతోఇంతో తీసుకొని వారే అన్ని పనులు చేసిపెట్టేవారని పేర్కొంటున్నారు. ప్రభుత్వం దళారీవ్యవస్థ లేకుండా చేయాల న్న చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో కొంతమే ర ఫలితాలు కనిపిస్తున్నా దొడ్డిదారిన మామూళ్లు తీసుకుంటున్నారన్న ఆరోపణలు వాహనదారుల నుంచి వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఆర్టీఏ ఏ జెంట్లకు ఉపాధి కరువై జీవనం ఇబ్బందిగా మారింది.
మూడు నెలల్లో రూ.30 కోట్లు
రవాణా శాఖకు ఈ ఆర్థికసంవత్సరం(20245- 26)వరకు రూ.120కోట్ల రెవెన్యూ లక్ష్యాన్ని ప్రభు త్వం విధించింది. జిల్లా కేంద్రంలోని ఆర్టీఏ కార్యాలయంలో ఎక్కువగా లారీలు, ట్రాక్టర్ల ద్వారా రెవె న్యూ వస్తుండగా, కోదాడ ఎంవీఐలో పరిసర ప్రాం తాల్లో సిమెంట్ పరిశ్రమలు ఉండడంతో లారీల రిజిస్ట్రేషన్ ద్వారా ఆదాయం వస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి ఇప్పటికే దాదాపు రూ.30 కోట్ల వరకు ఆదాయం లభించిన ట్లు తెలుస్తోంది. ఈ నెల ఆషాఢమాసం కావడంతో వాహనాల కొనుగోళ్లు తగ్గాయి. దీంతో రిజిస్ట్రేషన్లు కూడా సన్నగిల్లాయి. ఇదిలా ఉండగా అనుకున్న మేరకు ఆదాయం లేకపోతే రవాణావాఖ అధికారు లు తనిఖీల బాటపడుతారు. కార్లు, బస్సులు, లారీ లు, పెద్దపెద్ద ట్రక్కులు, హార్వేస్టర్ల వంటి వాటిని తనిఖీచేస్తారు. రిజిస్ట్రేషన్లు, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్, ఫిట్‌నెస్ లేకపొతే జరిమానాలు విధిస్తారు. సాదారణంగా ఆటోలు, కార్లు, ట్రాక్టర్లు, బస్సులు, లారీలు, మినీ ట్రాన్స్‌పోర్ట్ వాహనాలకు ప్రతి రెండేళ్లకు ఒకసారి ఫిట్‌నెస్ చేయించాలి.
కొనుగోలు చేసి న తర్వాత ఏడేళ్లు దాటితే ప్రతి ఏడాది ఫిట్‌నెస్ చేయించాలి. కేవలం జూన్‌లోనే అంబులెన్స్ ఒకటి రిజిస్ట్రేషన్ కాగా ఆటోలు 63, కా ర్లు 71, మోటార్ సైకిళ్లు 733, బస్సులు 38, ట్రాక్టర్లు 178, ట్రాక్టర్ ట్రైలర్స్ 100, హార్వెస్టర్ 1, స్టేజీ క్యారేజీబస్సులు రెండు రిజిస్ట్రేషన్లు జరిగాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి బాగానే ఆదాయం వచ్చింది. జూన్‌లో హెవీమోటార్ వెహికిల్ లైసెన్సులు 31, లైట్ మోటార్ వెహికిల్స్ లైసెన్సులు 536, మోటార్‌సైకిల్ లైసెన్స్‌లు 552, ట్రాక్టర్ లైసెన్స్‌లు 118, ఇతర వాహనాలకు లైసెన్స్‌లు 114 పొందారు.
ఏజెంట్లను అనుమతించడం లేదు : జి సురే్‌షరెడ్డి, డీటీవో
ప్రభుత్వం నిబంధనల మేరకు ఆర్టీఏ ఏజెంట్లను కార్యాలయంలోకి అనుమతించడంలే దు. అన్ని ఫాంలు సరిగా ఉంటే వెంటనే రిజిస్ట్రేషన్లు చేస్తున్నాం. నే రుగా వస్తే కొర్రీలు పెడుతున్నారనేది అవాస్తవం.
Updated Date - Jul 04 , 2025 | 12:22 AM