ప్రభుత్వ నిధులతో హెలీకాప్టర్ కొనివ్వాలి
ABN, Publish Date - Jul 01 , 2025 | 12:33 AM
భువనగిరి (కలెక్టరేట్), జూన 30 (ఆంధ్రజ్యోతి): తమ వ్యవసాయ భూముల్లోకి, ఇళ్లలోకి వెళ్లకుండా దారి కబ్జా చేశారని.. ప్రభుత్వ నిధులతో తమకు హెలికాప్టర్ కొనిచ్చి ఆదుకోవాలని బహద్దూర్‌పేట రైతులు అదనపు కలెక్టర్ వీరారెడ్డిని కోరారు.
మా పొలానికి వెళ్లేందుకు దారి లేదు
భువనగిరి (కలెక్టరేట్), జూన 30 (ఆంధ్రజ్యోతి): తమ వ్యవసాయ భూముల్లోకి, ఇళ్లలోకి వెళ్లకుండా దారి కబ్జా చేశారని.. ప్రభుత్వ నిధులతో తమకు హెలికాప్టర్ కొనిచ్చి ఆదుకోవాలని బహద్దూర్‌పేట రైతులు అదనపు కలెక్టర్ వీరారెడ్డిని కోరారు. సోమవారం ఈ మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘ప్రజావాణి’లో అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ బహద్దూర్‌పేట నుంచి చిన్నకందుకూరు గ్రామాన్ని కలిపే లింకు రహదారిని కొంతమంది అక్రమంగా కబ్జాచేశారని, రహదారికి అడ్డంగా పెద్ద బండరాళ్లను పెట్టి ఫెన్సింగ్ వేయించారని తెలిపారు. దీంతో నాలుగు ఎస్టీ కుటుంబాలకు చెందినతాము ఇళ్లలోకి వెళ్లే దారిలేక ఇతరుల ఇళ్ల వాకిట తలదాచుకుంటున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. వ్యవసాయ భూముల్లోకి వెళ్లలేక విత్తనాలు విత్తలేక, వేసిన పంటలను రక్షించుకోలేక ఇబ్బందులు పడుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. రోడ్డును ఆక్రమించటంతో రాకపోకలు నిలిచిపోవటంతో ప్రభుత్వ నిధులతో హెలికాప్టర్ కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని కోరారు. అక్రమంగా నక్ష బాటను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, దారి సౌకర్యం కల్పించాలని కలెక్టరేట్ ఆవరణలో ప్లకార్డులను ప్రదర్శించారు. ‘ప్రజావాణి’లో ఫిర్యాదు చేసినవారిలో బహద్దూర్‌పేట గ్రామ రైతులు, ప్రజలు ఉన్నారు.
Updated Date - Jul 01 , 2025 | 12:33 AM