ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వృద్ధురాలి నుంచి 6 కిలోల కణితి తొలగింపు

ABN, Publish Date - Jun 25 , 2025 | 11:33 PM

ఇటీవలే నల్లగొండ జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో మోకాలి మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించిన వైద్యుల బృందం బుధవారం మరో శస్త్రచికిత్సను నిర్వహించింది.

తొలగించిన కణితిని చూపిస్తున్న వైద్యబృందం

నల్లగొండ టౌన, జూన 25 (ఆంధ్రజ్యోతి) : ఇటీవలే నల్లగొండ జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో మోకాలి మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించిన వైద్యుల బృందం బుధవారం మరో శస్త్రచికిత్సను నిర్వహించింది. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం పర్వేదుల గ్రామానికి చెందిన 60 ఏళ్ల మహిళ రెండేళ్లుగా కడుపునొప్పితో బాధపడుతూ జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ప్రధానాసుపత్రికి వైద్యం నిమిత్తంవచ్చింది. వైద్యపరీక్షల అనంతరం ఆమె కడుపులో కణితి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మహిళ కుటుంబ సభ్యుల సమ్మతితో బుధవారం ఆపరేషన చేసి 6 కిలోల కణితిని తొలగించారు. ఈ శస్త్రచికిత్సలో సర్జన్ల బృందం డాక్టర్‌ శ్రీకాంతవర్మ, డాక్టర్‌ నిఖిత, డాక్టర్‌ వంశీ, డాక్టర్‌ దివ్య, అనస్తీషియా బృందం డాక్టర్‌ బద్రి నారాయణ, డాక్టర్‌ నవీన, డాక్టర్‌ సుధా, డాక్టర్‌ గిరి, డాక్టర్‌ శ్వేత పాల్గొన్నారు. సుమారు ఐదు గంటల పాటు శ్రమించి ఈ కణతిని తొలగించారు. ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో అత్యంత అధునాతన వైద్య పరికరాలు, వైద్య సదుపాయాలు, డాక్టర్లు ఉన్నందున ఇలాంటి ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అరుణకుమారి తెలిపారు. కణితి తొలగింపు శస్త్రచికిత్సను ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో విజయవంతంగా చేసిన డాక్టర్ల బృందాన్ని ఆమె అభినందించారు.

Updated Date - Jun 25 , 2025 | 11:33 PM