ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఎకరాకు రూ.24.50 లక్షలు?

ABN, Publish Date - Jul 12 , 2025 | 12:27 AM

గంధమల్ల రిజర్వాయర్‌ నిర్మాణానికి భూసేకరణ కసర త్తు తుది దశకు చేరింది. సము ద్ర మట్టానికి అత్యంత ఎత్తయి న ప్రాంతంగా, నదీజలాల సదుపాయం లేని కరువు నేల గా యాదాద్రి భువనగిరి జిల్లా కు పేరుంది. జిల్లాలో జలసిరు లు ప్రవహించేందుకు గత ప్రభుత్వం గోదావరి జలాల మళ్లింపునకు చర్యలు చేపట్టింది.

ఇది ‘గంధమల’్ల ముంపు పరిహారం!

జిల్లా యంత్రాంగం జరిపిన చర్చలో రైతుల అంగీకరించినట్లు సమాచారం

‘గంధమల’్ల రిజర్వాయర్‌కు దాదాపు 1100 ఎకరాలు

గంధమల్ల, వీరారెడ్డిపల్లిలో భూసేకరణకు కసరత్తు

(ఆంధ్రజ్యోతి-యాదాద్రి): గంధమల్ల రిజర్వాయర్‌ నిర్మాణానికి భూసేకరణ కసర త్తు తుది దశకు చేరింది. సము ద్ర మట్టానికి అత్యంత ఎత్తయి న ప్రాంతంగా, నదీజలాల సదుపాయం లేని కరువు నేల గా యాదాద్రి భువనగిరి జిల్లా కు పేరుంది. జిల్లాలో జలసిరు లు ప్రవహించేందుకు గత ప్రభుత్వం గోదావరి జలాల మళ్లింపునకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గం ధమల్ల రిజర్వాయర్‌ నిర్మాణం చేపట్టగా, ఇందుకోసం భూసేకరణ ప్రధాన సమస్యగా మా రింది. రైతుల డిమాండ్‌కు ప్రభుత్వం మధ్య పరిహారం విషయంలో కొంతకాలంగా సందిగ్ధం నెలకొనగా, ఎకరా కు రూ.24.50లక్షలు తీసుకునేందుకు రైతులు అంగీకరించినట్లు సమాచారం.

గోదావరి జలాల మళ్లింపునకు చేపట్టిన కాళేశ్వ రం ప్రాజెక్టు 14, 15, 16 ప్యాకేజీల కింద పనులు ప్రారంభించింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2.50 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే 14, 15వ ప్యాకేజీలో తుర్కపల్లి మండలం గంధమల్ల వద్ద రిజర్వాయర్‌ నిర్మించేందుకు గత ప్రభుత్వం ప్రణాళి క రూపొందించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేసి, వీలైనంత త్వర గా అవార్డ్‌ను పాస్‌ చేయనున్నారు. రైతులకు చెల్లించాల్సిన నష్టపరిహారాన్ని రెండు రోజుల్లోగా ఖరారు చేయనున్నారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం స్థానిక ప్రజాప్రతినిధులతోపాటు ఉన్నతాధికారుల తో చర్చించింది. అయితే ఉన్నతాధికారులు నష్టపరిహారంపై మంత్రులతో చర్చించి ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. రైతులకు వారు కోరిన విధం గా కాకుండా మధ్యస్థంగా పరిహారం ఫైనల్‌ చేయాలని జిల్లా యంత్రాంగానికి సూచించింది. దీంతో భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే సాగునీటి ప్రాజెక్టులతోపాటు రీజినల్‌ రింగ్‌రోడ్డుతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఈ నేపథ్యంలో విలువైన భూములను తక్కువ ధరకే ప్రభుత్వానికి అప్పగించేందుకు రైతులు ససేమిరా అంటున్నారు. రెవెన్యూ యంత్రాంగం రిజర్వాయర్‌తో ముంపునకు గురవుతో న్న రైతులు, బాధితులతో చర్చలు నిర్వహించింది. తుర్కపల్లి మండలం గంధమల్లలో రిజిస్ర్టేషన్‌ విలువ ప్రకారం ధర రూ.3.60లక్షల వరకు ఉంటుంది. మొదట ప్రభుత్వం మూడింతలు.. రూ.16లక్షల నుంచి రూ.18లక్షల వరకు చెల్లిస్తామ ని జిల్లా యంత్రాంగం రైతులకు వివరించింది. రైతులకు భూసేకరణ, పునరావాసం, పునరావాసం లో న్యాయమైన పరిహారం, పారదర్శకత హక్కు చట్టం 2013 ప్రకారం పరిహారం చెల్లిస్తామని తెలిపారు. ముంపునకు గురయ్యే ప్రాంతాల్లోని రైతులు అడుగుతున్న పరిహారానికి, ప్రభుత్వం చెల్లిస్తామ న్న పరిహారానికి భారీ వ్యత్యాసం కన్పించడంతో రైతులు అంగీకరించలేదు. మార్కెట్‌ ధర ప్రకారం ఈప్రాంతంలోని రైతులు రూ.40లక్షలకు తక్కువగా తీసుకునే ప్రసక్తే లేదని రైతులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వం మాత్రం రైతులు కోరిన విధంగా పరిహారం ఇచ్చే పరిస్థితి లేదని, ఎకరాకు రూ.24లక్షల నుంచి రూ.25లక్షల వరకు అవార్డు పాస్‌ చేసే అవకాశం ఉంది. ఈమేరకు రైతులు కూడా అంగీకరించినట్లు సమాచారం.

రిజర్వాయర్‌ నిర్మాణంతో 1100 ఎకరాల్లో ముంపు

తుర్కపల్లి మండలంలో గంధమల్ల రిజర్వాయర్‌ పనులకు ఈ నెల 6న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.575.57కోట్లతో నిర్మిస్తున్న పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తయింది. బీకేఎం-నవయుగ-ప్రసాద్‌ అనే సంస్థ కాంట్రాక్టు దక్కించుకుంది. రిజర్వాయర్‌ నిర్మాణంతో ముంపునకు గురయ్యే వీరారెడ్డిపల్లి, గంధమల్ల రెవెన్యూ గ్రామాల్లో దాదాపు 1100 ఎకరాల వరకు భూమిని సేకరించాల్సి ఉంటుంది. ఇందులో కట్ట నిర్మించేందుకు దాదాపు 112ఎకరాలు, ముంపు ప్రాంతాలైన గంధమల్లలో 650ఎకరాలు, వీరారెడ్డిపల్లిలో 340 ఎకరాలు సేకరించనున్నారు. రెండు కిలో మీటర్ల పొడవును కట్ట నిర్మించనున్నారు. ఈ భూమిని గంధమల్ల గ్రామంలో సేకరించాలి. ఈ రిజర్వాయర్‌ నిర్మాణం పూర్తయిన పక్షంలో ఆలేరు నియోజకవర్గంలో దాదాపు 60వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. వీటిలో తుర్కపల్లిలో 945 ఎకరాలు, ఆలేరు మండలంలో 10,506 ఎకరాలు, రాజపేట మండలంలో 33,014 ఎకరాలు, యాదగిరిగుట్ట మండలంలో 14,522 ఎకరాలకు సాగునీరు అందనుంది.

1.41 టీసీఎంలకు పరిమితం

ప్రభుత్వంలో గతంలో ప్రతిపాదించిన అంచనాలను రద్దు చేసి, తాజాగా ఈ రిజర్వాయర్‌ను 1.40 టీఎంసీలకు పరమితం చేసింది. ఎత్తిపోతల లింక్‌ ప్రాజెక్టులో చివరి(టైల్‌ఎండ్‌)లో గంధమల్ల, బస్వాపూర్‌ రిజర్వాయర్లు ప్రతిపాదించారు. ప్రభుత్వం పూర్తిస్థాయి సర్వేకు ఆదేశించడంతో రిజర్వాయర్‌ నిర్మాణంతో కోల్పోతున్న భూముల్లో ప్రాజెక్టుకు సంబంధించిన హద్దురాళ్లను కూడా ఏర్పాటు చేశారు. ఈ రిజర్వాయర్‌ను మొదటగా 9.8 టీఎంసీలుగా నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ నుంచి కాల్వల ద్వారా 2,450 క్యూసెక్కుల నీరు గంధమల్ల జలాశయానికి చేరేలా ప్రణాళికను రూపొందించారు. డిస్ర్టిబ్యూటరీ కాల్వల ద్వారా 6,467ఎకరాలు, ప్రధాన ఎడమకాల్వ(ఎల్‌ఎంసీ)ద్వారా 37,814 ఎకరాలు, కుడికాల్వ (ఆర్‌ఎంసీ) ద్వారా 19,901 ఎకరాలు సాగునీరు అందించేందుకు అంచనాలు రూపొందించారు. ప్రధాన కాల్వ, డిస్ర్టిబ్యూటరీలకు 4,162ఎకరాల భూమి అవసరం కాగా, రిజర్వాయర్‌ వల్ల 4,027 ఎకరాల భూమితో పాటు 1,568 ఇళ్లు ముంపునకు గురవుతున్నాయి. ఈ రిజర్వాయర్‌ నిర్మాణంతో గంధమల్ల, బచ్చలగూడెం, ఇందిరానగర్‌ గ్రామాలు పూర్తిగా ముంపునకు గురవుతుండగా వీరారెడ్డిపల్లిలో దాదాపు 1800 ఎకరాలు వరకు భూములు కోల్పోయే అవకాశం ఉందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్వాసితుల నిరసన వ్యక్తం చేయడంతో మరోసారి 4.28టీఎంసీలకు తగ్గించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సాగునీటి ప్రాజెక్టులపై నిర్వహించిన సమీక్షలో గ్రామాలు ముంపునకు గురికాకుండా, భూసేకరణ కూడా తక్కువ అయ్యేట్టు... గంధమల్ల రిజర్వాయర్‌ను 1.41టీఎంసీలకు తగ్గించింది.

సర్వే పనులు ప్రారంభం

తుర్కపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గంధమల్ల రిజర్వాయర్‌ నిర్మాణ పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. శుక్రవారం రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు సర్వే పనులు ప్రారంభించారు. గంధమల్ల గ్రామానికి ఎలాంటి నష్టం జరగకుండా భూ సేకరణ చేస్తున్నారు. ప్రస్తుతమున్న చెరువు కట్ట ఆధారంగానే 2.95 కిలోమీటర్ల దూరం కట్ట నిర్మాణ పనులు చేపట్టేందుకు అధికారులు భూ సర్వే నిర్వహిస్తున్నారు. ఏ రైతు భూమి, ఏ సర్వే నెంబర్‌లో ఎంత పోతుంది. అనే దానిపై వివరాలు సేకరిస్తున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ గుగులోత్‌ దేశ్యానాయక్‌, ఇరిగేషన్‌ డీఈ శైలేందర్‌, సర్వేయర్లు పాల్గొన్నారు.

న్యాయమైన పరిహారం చెల్లించాలి : జక్కుల వెంకటేశ్‌, భూ నిర్వాసితుడు, గంధమల్ల

ప్రభుత్వం చేపట్టిన గంధమల్ల రిజర్వాయర్‌ నిర్మాణంతో రైతులు భూములు, వ్యవసాయ బోరు, బావులు, పశువుల షెడ్లతోపాటు సర్వం కోల్పోతున్నాం. ప్రభుత్వం తమకు ఇస్తామన్నా న్యాయపరమైన పరిహారంతోపాటు అదనంగా బోరు, బావులు, పశువుల షెడ్లు, ఫలవృక్షాలకు కూడా పరిహారం ఇవ్వాలి. రిజర్వాయర్‌లో భూములు కొల్పోతున్న రైతులకు న్యాయపరమైన పరిహారం ఇవ్వాలి.

Updated Date - Jul 12 , 2025 | 12:27 AM