100లీటర్ల కల్తీపాలు స్వాధీనం
ABN, Publish Date - Jul 04 , 2025 | 12:18 AM
భూదానపోచంపల్లి మండలం కనుముకుల గ్రామంలో ఓ పాల వ్యాపారి పాలను కల్తీ చేస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు.
వ్యాపారి అరెస్ట్
భూదానపోచంపల్లి, జూలై 3 (ఆంధ్రజ్యోతి) : భూదానపోచంపల్లి మండలం కనుముకుల గ్రామంలో ఓ పాల వ్యాపారి పాలను కల్తీ చేస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కనుముకుల గ్రామానికి చెందిన కుంభం రఘు అనే వ్యక్తి చుట్టు పక్కల గ్రామాలనుంచి పాలను సేకరిస్తాడు. 50లీటర్ల వరకు రైతులనుంచి సేకరిస్తాడు. హైదరాబాద్‌కు తన సొంత వాహనం ద్వారా పాలను తరలించి, అపార్ట్‌మెంట్లలో విక్రయిస్తాడు. ఈ క్రమంలో గురువారం కృత్రిమ పాలను తయారు చేస్తుండగా అతని వద్ద 100 లీటర్ల పాలు, 200 మిల్లీ లీటర్ల ద్రావణం, నాలుగు పాల పౌడర్ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు కల్తీ పాలు తయారు చేస్తుండగా అతన్ని అరెస్టు చేశామని తెలిపారు. సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Updated Date - Jul 04 , 2025 | 12:18 AM