ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కథకు పుట్టినిల్లు నల్లగొండ

ABN, Publish Date - Jun 16 , 2025 | 12:32 AM

ఆధునిక తెలుగు కథకు నల్లగొండ జిల్లా పుట్టినిల్లని, తెలుగు సాహిత్యంలో నల్లగొండ కథ తనదైన ముద్ర వేసిందని సాహితీ వేత్తలు డాక్టర్‌ ఏనుగు నరసింహారెడ్డి, డాక్టర్‌ సుంకిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.

బర్కతి పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సాహితీవేత్తలు

నల్లగొండ కల్చరల్‌, జూన్‌ 15(ఆంధ్రజ్యోతి): ఆధునిక తెలుగు కథకు నల్లగొండ జిల్లా పుట్టినిల్లని, తెలుగు సాహిత్యంలో నల్లగొండ కథ తనదైన ముద్ర వేసిందని సాహితీ వేత్తలు డాక్టర్‌ ఏనుగు నరసింహారెడ్డి, డాక్టర్‌ సుంకిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లాకేంద్రంలోని యూటీఎఫ్‌ భవ నంలో ఆదివారం ఏర్పాటు చేసిన రచయిత సాగర్ల సత్తయ్య రచించిన ‘బర్కతి’ కథా సంపుటిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బర్కత్‌ సంపుటిలో రచయిత చక్కని శిల్పంతో ఆకట్టుకునే శైలిలో కథలు రాశారని కొనియాడారు. తెలంగాణ సంస్కృతిని గ్రామీణ వాతావరణాన్ని రచయిత కథలు అద్భుతంగా చిత్రికరించారన్నారు. సృజన సాహితీ సంస్థ అధ్యక్షుడు పెరుమాళ్ళ ఆనంద్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సాహితీ వేత్తలు, కవులు మేరెడ్డి యాదగిరిరెడ్డి, డాక్టర్‌ కృష్ణ కౌండిన్య, పగడాల నాగేందర్‌, బైరెడ్డి కృష్ణారెడ్డి, ఎలికట్టే శంకర్‌రావు, ఎంఈవో మేక నాగయ్య, యూటిఎఫ్‌ రాష్ట్ర నా యకులు ఎడ్ల సైదులు, శీలం భద్రయ్య, బండారు శంకర్‌, జానకిరామ్‌, సైదులు, గోవర్థన్‌, రవీందర్‌రెడ్డి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 16 , 2025 | 12:32 AM