kumaram bheem asifabad- భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు
ABN, Publish Date - Jul 29 , 2025 | 11:25 PM
జిల్లా లో నాగుల పంచమి వేడుకలను మంగళవారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. భక్తులు పుట్టలో నాగదేవతకు పాలు పోసి నైవేద్యాలు సమర్పించారు. జిల్లాలోని మహిళలు తమ కుటుంబాలను నాగదేవత సంరక్షించాలని పుట్లలో పాలు పోసి పూజించారు. దేవతామూర్తుల దర్శనానికి వచ్చిన భక్తులతో ఆలయాల్లో సందడి నెలకొంది.
ఆసిఫాబాద్‌రూరల్/కాగజ్‌నగర్/రెబ్బెన/దహెగాం//పెంచికలపేట/కెరమెరి/లింగాపూర్/ిచింతలమానేపల్లి/సిర్పూర్(యు)/బెజ్జూరు/సిర్పూర్(టి), జూలై 29 (ఆంధ్రజ్యోతి): జిల్లా లో నాగుల పంచమి వేడుకలను మంగళవారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. భక్తులు పుట్టలో నాగదేవతకు పాలు పోసి నైవేద్యాలు సమర్పించారు. జిల్లాలోని మహిళలు తమ కుటుంబాలను నాగదేవత సంరక్షించాలని పుట్లలో పాలు పోసి పూజించారు. దేవతామూర్తుల దర్శనానికి వచ్చిన భక్తులతో ఆలయాల్లో సందడి నెలకొంది. పుట్ట మట్టిని బంగారంగా స్వీకరించి తిలకధారణ చేసుకున్నారు. పసుపు కుంకుమలు వాయినాలుగా పంచుకున్నారు.. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని నాగసుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో జిల్లా కలెక్టర్ వెంకటేష్‌దోత్రే దంపతులు పాల్గొని అర్చకుడు శిరీష్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని బజారువాడి, దస్నాపూర్, హనుమాన్ మందిర్, జన్కాపూర్, సందీప్‌నగర్, చెక్‌పోస్టు కాలనీలో మహళలు పెద్ద ఎత్తున పుట్టల వద్ద పాలు పోసి నైవేద్యాలు సమర్పించారు. కాగజ్‌నగర్ పట్టణంలోని సర్‌సిల్క్ కాలనీలో రాంమందిర్ ఆలయంలో, ఓల్టు కాలనీ హనుమాన్ ఆలయంలో నాగు పాము పుట్టల వద్ద మహిళలు ఉదయం నుంచి పాలు పోశారు. అలాగే స్థానిక శివనాగరాజు ఆలయంలో ఉదయం నుంచి పాలు పోసేందుకు మహిళలు బారులు తీరారు. రెబ్బెన మండలం ఇందిరనగర్‌లోని అమ్మవారి ఆలయంలో పుట్టలో మహిళలు పాలు పోశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి దేవర వినోద్ స్వామి భక్తులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. సిర్పూర్(యు) మండల కేంద్రంలో గల ప్రాచీన మహాదేవ్ ఆలయంతోపాటు హన్మున్ ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. పలు గ్రామాల ఆదివాసీలు కేస్లాపూర్‌లోని నాగోబా దేవతను దర్శించడానికి తరలివెళ్లారు.సిర్పూర్(టి) నాగమ్మ చెరువు వద్ద పుట్టల వద్ద పాలు పోసి నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే వేంకటేశ్వ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Updated Date - Jul 29 , 2025 | 11:25 PM