ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

క్షేత్రపాలకుడికి నాగవల్లీ దళార్చనలు

ABN, Publish Date - Jul 16 , 2025 | 12:33 AM

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో కొలువుదీరిన క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి మంగళవారం నాగవల్లీ దళార్చనలు, లక్ష్మీనరసిం హుడికి నిత్య కల్యాణం, నిత్యార్చనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి.

క్షేత్రపాలకుడికి హారతి నివేదిస్తున్న అర్చకుడు

యాదగిరిగుట్ట, జూలై 15 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో కొలువుదీరిన క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి మంగళవారం నాగవల్లీ దళార్చనలు, లక్ష్మీనరసిం హుడికి నిత్య కల్యాణం, నిత్యార్చనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. కొండపైన విష్ణుపుష్కరిణి వద్ద ఆంజనేయస్వామికి ఆలయంలో అర్చకులు వేద మంత్ర పఠనాలతో పంచామృతాభిషేకం నిర్వహిం చారు. ప్రధానాలయంలో స్వయంభువులను సుప్రభాత సేవలతో మేల్కోలిపి నిజాభిషేకం, నిత్యార్చనలు, ముఖ మండపంలో సుదర్శన నారసింహ హోమం, నిత్య తిరుకల్యాణోత్సవ పర్వాలు పాంచారాత్రగమ శాస్త్రరీతిలో నిర్వహిం చారు. శివాలయంలో పర్వతవర్థిని రామలింగేశ్వర స్వామికి ముఖ మండపంలోని స్ఫటికమూర్తులకు నిత్య పూజలు, నిత్య రుద్రహవనం శైవాగమన పద్ధతిలో కొనసాగాయి. పాతగుట్ట ఆలయంలో ఆంజనేయస్వామిని పంచామృతాలతో అభిషేకించి ఆకుపూజ నిర్వహించారు. వివిధ విభా గాల ద్వారా ఆలయ ఖజానాకు రూ. 12,96,792 ఆదాయం సమకూరినట్లు ఈవో ఎస్‌. వెంకట్రావు తెలిపారు.

మఠంపల్లి: సూర్యాపేట జిల్లా మట్టపల్లి లక్ష్మీనరసింహుడి క్షేత్రంలో స్వామివారి నిత్య కల్యాణాన్ని శాస్ర్తోక్తంగా నిర్వహించారు భక్తులకు నీరాజనమంత్రపుష్పాలతో మహానివేధన గావించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలోఆలయ ధర్మకర్త చెన్నూరి మట్టపల్లిరావు, విజయకుమార్‌, ఈవో సిరికొండనవీన్‌, అర్చకులు తూమాటి శ్రీనివాసాచార్యులు, పద్మనాభాచార్యులు, కృష్ణామాచార్యులు, రామాచార్యులు, మంగాచార్యులు పాల్గొన్నారు.

Updated Date - Jul 16 , 2025 | 12:33 AM