ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నాణ్యమైన విధ్య వైద్యం అందిచడమే నాలక్ష్యం

ABN, Publish Date - May 03 , 2025 | 10:54 PM

నియోజికవర్గ ప్రజలకు మంచి నాణ్యమైన వైద్యంతో పాటు విధ్యార్థులకు నాణ్యమైన కార్పోరేట్‌ స్థాయి విధ్యను ఉచితంగా అందించడమే తన లక్ష్యం అని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు.

ఆసుపత్రి భవన నిర్మాణం పనులు పరిశీలిస్తున్న ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్‌

మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు

లక్షెట్టిపేట, మే 3(ఆంధ్రజ్యోతి): నియోజికవర్గ ప్రజలకు మంచి నాణ్యమైన వైద్యంతో పాటు విధ్యార్థులకు నాణ్యమైన కార్పోరేట్‌ స్థాయి విధ్యను ఉచితంగా అందించడమే తన లక్ష్యం అని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. శనివారం పట్టణంలో నూతనంగా నిర్మాణం చేపడుతున్న ప్రభుత్వ ఆసుపత్రి భవనంతో పాటు ప్రభుత్వ కళాశాల భవనాల నిర్మాణం పనులను జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌తో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ ప్రభుత్వం కూడా విధ్యా, వైద్య రంగంపై ప్రత్యేక దృష్టితో ముందుకు సాగుతుందన్నారు. మన లక్షెట్టిపేట పట్టణంలో రానున్న రోజుల్లో విద్య వైద్యం విషయంలో రాష్ట్రంలోనే రోల్‌ మోడల్‌గా మన జిల్లా ఉండాలనే లక్ష్యంతో అధికా రులు, నాయకుల పర్యవేక్షణలో పనులు ఎప్పటికప్పుడు పరిశీలించి సంభందిత అధికారులతో చర్చిస్తున్నామన్నారు. ప్రభుత్వ కళాశాల, పాఠశాల భవన నిర్మాణం పనులు ప్రారంభించి సంవత్సరం కూడా పూర్తి కాలేదని కేవలం పది నెలల్లోనే పనులు చివరి దశకు చేరకున్నాయంటే ఇది రాష్ట్రంలోనే రికార్డు అన్నారు. వచ్చె నెల 12వ తారీకున ఆసుపత్రి భవనంతో పాటు కళాశాల, పాఠశాల భవనాలు కూడా ప్రారంభించేందుకు సిద్దం చేస్త్తున్నామన్నారు. ఈకార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట ఆసుపత్రి సూపరిండెంట్‌ ఆకుల శ్రీనివాస్‌, మార్కెట్‌ కమిటి వైస్‌ చైర్మన్‌ ఆరీఫ్‌, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ చెల్ల నాగభూషణం, నాయకులు పూర్ణచందర్‌రావు, బొప్పు సుమన్‌, గడ్డం త్రిమూర్తి, గడ్డం శ్రీనివాస్‌, చింత అశోక్‌కుమార్‌, నలిమెల రాజుతో పాటు సంభందిత అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - May 03 , 2025 | 10:54 PM