కేసీఆర్ అసెంబ్లీకొస్తే అనేక సమస్యలకు పరిష్కారం: చామల
ABN, Publish Date - Mar 09 , 2025 | 03:17 AM
మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి ఎప్పుడొస్తారోనని తాము కూడా ఆసక్తితో ఎదురు చూస్తున్నట్టు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారు. ఆయన అసెంబ్లీకి వస్తే అనేక సమస్యలకు పరిష్కారమవుతాయని వ్యాఖ్యానించారు.
బీజేపీవి శిఖండి రాజకీయాలు: చనగాని
హైదరాబాద్, మార్చి8 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి ఎప్పుడొస్తారోనని తాము కూడా ఆసక్తితో ఎదురు చూస్తున్నట్టు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారు. ఆయన అసెంబ్లీకి వస్తే అనేక సమస్యలకు పరిష్కారమవుతాయని వ్యాఖ్యానించారు. అసెంబ్లీకి వచ్చి కాంగ్రె్‌సను ఎండగడతానంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. రాష్ట్రానికి రూ.7 లక్షల కోట్లు అప్పు చేసింది మీరే కాబట్టి ముందు ఎందుకు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
‘కేసీఆర్.. కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్ పెట్టిందెవరు..? పదేళ్ల మీ దౌర్భగ్య పాలన ఫలితమే కాదా..? మీ తప్పులు మాఫీ చేసే అక్షయ పాత్ర ప్రభుత్వం వద్ద లేదు. లోక్‌సభ ఎన్నికల్లో మీకు సున్నా సీట్లొస్తే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసలు అభ్యర్థినే నిలబెట్టలేదు’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బీజేపీ నేతలు శిఖండి రాజకీయాలు చేస్తున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ దుయ్యబట్టారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవగానే ఆ పార్టీ నేతలు అధికారంలోకి వస్తామంటూ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Hyderabad: మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో..
Car Accident: అంతా చూస్తుండగానే అదుపుతప్పిన కారు.. క్షణాల్లోనే..
Updated Date - Mar 09 , 2025 | 03:17 AM