kumaram bheem asifabad- అమ్మపాలే అమృతం
ABN, Publish Date - Aug 01 , 2025 | 11:12 PM
తల్లిపాలే పిల్లలకు అమృతతుల్యం. బిడ్డ శారీరక ఎదుగుదలకు తల్లిపాలు ఎంతగానో దోహదపడతాయి. నవజాత శిశువుకు బలం చేకూర్చే ఆహారం తల్లిపాలేనని నిపు ణులు యూడా చెబుతున్నారు. అయితే ఈ విషయం తెలిసినా చాలా మంది ముర్రుపాలు ఇచ్చేందుకు ఇష్టపడడం లేదు. అపనమ్మకం, అభద్రత భావం కారణం ఏదైతేనేం బిడ్డకు పాలు అందిచేందుకు అయి ష్టత చూపుతున్నారు.
చిన్నారుల్లో రోగ నిరోధక శక్తి మెరుగు
- ప్రారంభమైన తల్లి పాల వారోత్సవాలు
వాంకిడి, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): తల్లిపాలే పిల్లలకు అమృతతుల్యం. బిడ్డ శారీరక ఎదుగుదలకు తల్లిపాలు ఎంతగానో దోహదపడతాయి. నవజాత శిశువుకు బలం చేకూర్చే ఆహారం తల్లిపాలేనని నిపు ణులు యూడా చెబుతున్నారు. అయితే ఈ విషయం తెలిసినా చాలా మంది ముర్రుపాలు ఇచ్చేందుకు ఇష్టపడడం లేదు. అపనమ్మకం, అభద్రత భావం కారణం ఏదైతేనేం బిడ్డకు పాలు అందిచేందుకు అయి ష్టత చూపుతున్నారు. ఫలితంగా పిల్లల్లో రోగనిరోధ కశక్తి తగ్తి భవిష్యత్తులో వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తల్లి పాల ఆవశ్యక తను తెలుపుతూ ప్రభుత్వం ఏటా వారోత్సవాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సమగ్ర శిశు క్షేమ శాఖ ఆగస్టు 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు వారోత్సవాలను నిర్వహిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టులు 973 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 0 నుంచి 6 నెలల శిశువులు 3,457 7 నెలల నుంచి 3 ఏళ్ల పిల్లలు 20,357 మంది ఉన్నారు. 3 నుంచి 7 ఏళ్ల పిల్లలు 20,100 ఉన్నారు. 4,629 గర్భిణులు, 3,418 మంది బాలింతలు ఉన్నారు. బిడ్డ పుట్టిన వెంటనే 70 శాతం మంది తల్లులు బిడ్డలకు ముర్రుపాలు అందిస్తుండగా 30 శాతం మంది ఆరు నెలల వరకు మాత్రమే పాలు పడుతున్నారని అధికారులు చెబుతున్నారు.
- మొదటి రెండు రోజులు కీలకం
బిడ్డ పుట్టిన మొదటి రెండు రోజులు ఎంతో కీలకమని వైద్యనిపుణులు చెబుతున్నారు. పుట్టిన కొద్ది సేపటికే ముర్రుపాలు తాగేలా చూడాలి. ఈ రోజుల్లో ఇచ్చే పాలల్లో కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇందులో రోగ నిరోధక శక్తి పెంచే అంశాలు ఉంటాయి. బిడ్డ పలు రకాల వ్యాధుల బారిన పడకుండా ఎంతగానో దోహదపడుతుంది. దీంతో పాటు ఆరు నెలల వరకు తల్లి పాలను మాత్రమే అందించాలి. తర్వాత మంచి పౌష్టికాహారిన్న ఇవ్వడం ద్వారా పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారు. బిడ్డ ఎతుగుదలకు కావాల్సిన ప్రోటిన్లు, పోషకాలు, మాం సకృత్తులు, పిండి పదార్దాలన్ని సమతుల్యంగా తల్లిపాలల్లో లభిస్తాయి. అందువల్ల తప్పని సరిగా ఆరు నెలల వరకు తల్లి పాలనే పట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రచారం చేస్తుంది.
- తల్లికి పోషకాలు అవసరం
ప్రసవం తరువాత బాలింతలు తీసుకునే ఆహారం కూడా పోషక విలువలు కలిగి ఉండాలని వైద్యులు చెబుతున్నారు. తల్లి పోషకాహారం తీసుకుంటే బిడ్డకు కూడా అలాంటి ఆహారాన్ని అందిచేందుకు అవకాశం ఉటుంది. రోజు 600 గ్రాముల అన్నం, 200 గ్రాముల పప్పు, 150 గ్రాముల కూరలు, ఉడకబెట్టిన గుడ్డు, ఒ పండు, 100 మిల్లీలీటర్ల పాలు తీసుకోవాలి. ప్రతి రోజు ఆహారంలో పప్పు, ఆకుకూరలు పీచు పదార్దాలు ఉండేలా చూసుకోవాలి.
- ప్రయోజనాలు..
ఫ పోతపాలు తాగే వారితో పోలిస్తే తల్లిపాలు తాగిన పిల్లల్లో ఊబకాయం, గుండె జబ్బులు, అధిక రక్త పోటు, డయాబెటిస్ వంటి వ్యాధులు తక్కువని వైద్యులు చెబుతు న్నారు.
ఫ రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది, ఎదుగుదల సక్రమంగా ఉంటుంది. ఎముకల పుష్టి బాగుంటుంది.
ఫ కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే శాతం తక్కువ. మానిసిక రుగ్మతలు దూరమవుతాయని వైద్యనిపుణు లు చెబుతున్నారు.
ఫ పాలు ఇవ్వడం వల్ల బిడ్డకే కాకుండా తల్లి ఆరోగ్యానికి మంచిది.
ఫ కాన్పు తరువాత వచ్చే కొన్ని రకాల మానసిక వ్యాధులు తల్లి దరిచేరవు.
ఫ బిడ్డకు పాలిచ్చే స్త్రీలో రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ ముప్పు తక్కువగా ఉంటుంది.
సద్వినియోగం చేసుకోవాలి
రిబ్కా, ఇన్‌చార్జి సీడీపీవో, వాంకిడి
ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు నిర్వహిస్తున్న తల్లి పాల వారోత్సవాలను గర్భిణులు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వ ఆదేశాల మెరకు ఏటా తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తున్నాం. వారం రోజుల పాటు ప్రతి అంగన్‌వాడీ కేంద్రం పరిధిలో కార్యక్రమం కొనసాగతుంది. తల్లిపాలు బిడ్డకు అందిం చడం ద్వారా ఎలాంటి లాభాలు చేకురుతాయనే అం శంపై గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పిస్తాం, తల్లి పాల వారోత్సవాలు విజయవంతమయ్యేలా అంగ న్‌వాడీ కార్యకర్తలు కృషి చేయాలి.
Updated Date - Aug 01 , 2025 | 11:12 PM