kumaram bheem asifabad- మరింత చేరువలో .. మీ సేవ
ABN, Publish Date - Jul 06 , 2025 | 10:55 PM
ఇప్పటికే పలు రకాల ప్రయోజనాలను అందిస్తున్న ‘మీ సేవ’ ప్రజలకు మరింత చేరువవుతోంది. ప్రజలకు పలు రకాల సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ప్రస్తుతం మీ సేవ కేంద్రాలు రెవెన్యూ, పట్టణ, పంచాయతీరాజ్ తదితర శాఖల సేవలు అందిస్తూ పలు ధ్రువీకరణ పత్రాల జారీతో ఎన్నో రకాల ప్రయోజనాలను అందిస్తున్నాయి. తాజాగా రిజిస్ట్రేషన్‌శాఖ జారీ చేసే వివాహ ధ్రువీకరణ, వ్యవసాయేతర భూముల మార్కెట్ విలువ ధ్రువీకరణ పత్రాలను మీ సేవ ద్వారా పొందే వెసులు బాటు కల్పించింది.
వాంకిడి, జూలై 6 (ఆంధ్రజ్యోతి): ఇప్పటికే పలు రకాల ప్రయోజనాలను అందిస్తున్న ‘మీ సేవ’ ప్రజలకు మరింత చేరువవుతోంది. ప్రజలకు పలు రకాల సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ప్రస్తుతం మీ సేవ కేంద్రాలు రెవెన్యూ, పట్టణ, పంచాయతీరాజ్ తదితర శాఖల సేవలు అందిస్తూ పలు ధ్రువీకరణ పత్రాల జారీతో ఎన్నో రకాల ప్రయోజనాలను అందిస్తున్నాయి. తాజాగా రిజిస్ట్రేషన్‌శాఖ జారీ చేసే వివాహ ధ్రువీకరణ, వ్యవసాయేతర భూముల మార్కెట్ విలువ ధ్రువీకరణ పత్రాలను మీ సేవ ద్వారా పొందే వెసులు బాటు కల్పించింది. వివాహ ధ్రువపత్రం కోసం నూతన దంపతులు గతంలో ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు ఆ ప్రయాస లేకుండా వివాహన ధ్రువీకరణ పత్రం అవసరం ఉన్న వారు మీ సేవ కేంద్రం ద్వారా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. దీని కోసం వధూవరుల ఆధార్, ఎన్నికల సంఘం జారీ చేసిన ఓటరు ఐడీ కార్డు తదితర గుర్తింపు అవసరమవుతాయి. వయసు రుజువు కోసం పదో తరగతి మెమో, రెండు కుటుంబాలకు చెందిన వివాహ ఆహ్వాన పత్రికలు, పెళ్లికి సంబంధించిన రెండు ఫొటోలు, ముగ్గురు సాక్షులకు చెందిన గుర్తింపు పత్రాలు జిరాక్స్ ప్రతులు అందజేయాలి. గృహ నిర్మాణాలు, ఇతర బ్యాంకు రుణాల కోసం వ్యవసాయేతర భూములకు మార్కెట్ విలువ ధ్రువపత్రాలు తప్పనిసరి అవసరం. గతంలో వీటిన రిజిస్ట్రేషన్ శాఖలో మాన్యువల్‌గా అందించేవారు. ఇప్పుడు వాటిని సైతం మీ సేవ ద్వారా అందించనున్నారు.
- జాప్యం లేకుండా అందించాలని..
అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలను ప్రజలకు జాప్యం లేకుండా నిర్దిష్టమైన పద్ధతిలో అందిచాలన్న ఆశయంతో రాష్ట్ర ప్రభుత్వం సులభంగా, వేగంగా నినాదంతో 2011లో మీసేవ కేంద్రాలను ఏర్పాటు చేసింది. దశల వారీగా నూతన సేవలను అందుబాటులోకి తీసుకువస్తోంది. రెవెన్యూ, రవాణా, పోలీస్, జీహెచ్‌ఎంసీ, మున్సిపల్, విద్యుత్తు, ఎండోమెంట్, వ్యవసాయ, రిజిస్ట్రేషన్, పౌర సరఫరా, విద్యాశాఖకు చెందిన ప్రస్తుతం సుమారు 300 రకాల పౌర సేవలు అందిస్తుండగా గత మార్చి నుంచి మరో 9 రకాల సేవలను మీసేవ జాబితాలో చేర్పింది. రెమెన్యూ పరిధిలోని సేవలతో పాటు ఆటవీశాఖకు సంబంధించిన నూతన ఐచ్చికాలను అందుబాటులోకి తెచ్చింది. రెండు విద్యా కోర్సుల మధ్య గ్యాప్ పీరియడ్‌ను ఽద్రువీకరించడానికి గ్యాప్ సర్టిఫికెట్, పౌరుల సేరు మార్పిడి, పౌరులస్థానికతను నిర్ధరించేలా లోకల్ క్యాండిడేట్(స్థానిక అభ్యర్థి) సర్టిఫికెట్, మైనార్టీలకు మైనార్టీ పథకాలు, ఉపకారవేతనాలు, రిజర్వేషన్ వంటి అంశాలను ఽద్రువీకరిం చేలా మైనార్టీ సర్టిఫికేట్, కులం, ఆదాయం ఽద్రువ పత్రాల పునఃజారీ(రీఇష్యూ) వెనుకబ డిన తరగతులకు చెందిన వారికి క్రిమీలేయర్-నాన్ క్రిమీలేయర్ ధ్రవపత్రం, వయో వృద్దుల నిర్వహణ కేసులు, పర్యవేక్షణ వ్యవస్థ వంటి సేవలు రెవెన్యూ శాఖ పరిధిలో ఉన్నాయి. వన్యప్రాణుల దాడిలో మరణించిన వ్యక్తులు, జంతువులకు సంబంధించి అం దించే నష్టపరిహారం, కలప(టింబర్) డిపోలు, సామిల్ అనుమతులు, రెన్యూవల్, నిర్వహ ణ వంటి ఆటవీశాఖ సేవలు నూతనంగా మీసేవ కేంద్రాల్లో అందుబాటులోకి వచ్చాయి.
Updated Date - Jul 06 , 2025 | 10:55 PM