ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Water Bill: నెల నల్లా.. వెయ్యికి పైగానే

ABN, Publish Date - Jan 30 , 2025 | 09:59 AM

గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు ఔటర్‌ రింగ్‌ రోడ్డు(Outer Ring Road) పరిధిలో వాటర్‌బోర్డు తాగునీటి సరఫరా చేస్తోంది. సుదూర ప్రాంతాల నుంచి కృష్ణా, గోదావరి, సింగూరు, మంజీరా జలాలతో పాటు జంట జలాశయాల నీళ్లు తీసుకొచ్చి నగరవాసులకు సరఫరా చేస్తోంది.

- గ్రేటర్‌లో నల్లా కనెక్షన్లకు పెరిగిన డిమాండ్‌

- గతంలో నెలకు 500 లోపే..

- డిమాండ్‌కు అనుగుణంగా శివారుల్లో పైపులైన్‌ విస్తరణ

హైదరాబాద్‌ మహా నగరం ఔటర్‌ రింగ్‌ రోడ్డును హద్దుగా చేసుకొని శరవేగంగా విస్తరిస్తోంది. దీంతో నల్లా కనెక్షన్లు కావాలంటూ వాటర్‌ బోర్డు(Water Board)కు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. గతంలో నెలకు 500లోపే దరఖాస్తులు రాగా.. ప్రస్తుతం వెయ్యికిపైగానే వస్తున్నాయి. కొత్త కనెక్షన్లకు నీటిని సరఫరా చేసేందుకు వాటర్‌ బోర్డు పలు ఫేజ్‌ల్లో దాదాపు రూ.2వేల కోట్ల వ్యయం చేసి పైపులైన్లను విస్తరించింది.

హైదరాబాద్‌ సిటీ: గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు ఔటర్‌ రింగ్‌ రోడ్డు(Outer Ring Road) పరిధిలో వాటర్‌బోర్డు తాగునీటి సరఫరా చేస్తోంది. సుదూర ప్రాంతాల నుంచి కృష్ణా, గోదావరి, సింగూరు, మంజీరా జలాలతో పాటు జంట జలాశయాల నీళ్లు తీసుకొచ్చి నగరవాసులకు సరఫరా చేస్తోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 10.30లక్షల కనెక్షన్లకు రోజు విడిచి రోజు, శివారు ప్రాంతాల్లో సుమారు 2.50లక్షల కనెక్షన్లకు రెండు, మూడు రోజులకోసారి నీరు సరఫరా చేస్తోంది.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: భాగ్యనగర వాసులకు బిగ్ అలెర్ట్.. ఆ రోజున నీటి సరఫరా బంద్


విస్తరిస్తున్న మహా నగరానికి అనుగుణంగా వాటర్‌బోర్డు ఐదేళ్లలో ఓఆర్‌ఆర్‌ ఫేజ్‌-1 కింద రూ.725కోట్లు, ఓఆర్‌ఆర్‌ ఫేజ్‌-2కింద రూ.1200కోట్లు వ్యయం చేసి వేలాది కిలోమీటర్ల మేర పైపులైన్లను విస్తరించింది. శివారులోని ఏడు కార్పొరేషన్లు, ఎనిమిది మున్సిపాలిటీలలో పైపులైన్లను వేశారు. నీటి సరఫరాకు 300లకు పైగా డిస్ర్టిబ్యూషన్‌ రిజర్వాయర్లను సైతం నిర్మించింది. కొన్ని ప్రాంతాల్లో నిర్మాణాలు లేకపోయినా పైపులైన్‌ వ్యవస్థను వాటర్‌ బోర్డు ఏర్పాటు చేసింది.


పైపులైన్లను విస్తరించడంతో..

జీహెచ్‌ఎంసీతో పాటు ఔటర్‌ పరిధిలో పెద్దఎత్తున పైపులైన్లను విస్తరించడంతో వాటర్‌బోర్డుకు నల్లా కనెక్షన్ల కోసం దరఖాస్తు చేస్తున్నారు. సాధారణ నిర్మాణాలతో పాటు అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీ కాలనీల నుంచి పెద్దఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. గతంలో నెలకు 500లోపే దరఖాస్తులు రాగా, ప్రస్తుతం వెయ్యికి పైగా నల్లా కనెక్షన్‌ దరఖాస్తులు వస్తున్నాయి. డొమెస్టిక్‌ కనెక్షన్‌ కోసం 15 మీ.మీ. పైపు పరిమాణానికి రూ.1000 నిర్వహణ రుసుం దరఖాస్తుతో పాటు చెల్లిస్తుండగా.. 20 మీ.మీ. పైపు పరిమాణంగల కనెక్షన్‌ కోసం రూ.2000 చెల్లించి దరఖాస్తు చేసుకుంటున్నారు.


ఈ ప్రాంతాల నుంచి అధికంగా..

వాటర్‌బోర్డు పరిధిలో 22 ఆపరేషన్‌ మెయింటనెన్స్‌ డివిజన్లు ఉండగా.. ఇందులో అత్యధికంగా కొన్ని డివిజన్ల నుంచే దరఖాస్తులు వస్తున్నాయి. నెలకు వంద నుంచి 200 వరకు దరఖాస్తులు మణికొండ, మీర్‌పేట, కొంపల్లి, నిజాంపేట(Manikonda, Mirpet, Kompally, Nizampet), దుర్గంచెరువు, కూకట్‌పల్లి, బోడుప్పల్‌ డివిజన్ల నుంచే వస్తున్నాయి. మణికొండ డివిజన్‌ పరిధిలో ఒక్కోనెల 300లకు పైగా దరఖాస్తులు నల్లా కనెక్షన్ల కోసం వచ్చాయి. ఆయా దరఖాస్తులను కొన్ని ప్రాంతాల్లో సకాలంలో పరిష్కరిస్తుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో వివిధ రకాల కొర్రీలను పెట్టి తొక్కిపెడుతున్నారు. చేతులు తడిపితేనే నల్లా కనెక్షన్లను జారీ చేస్తున్నారనే ఆరోపణలు కొందరూ మేనేజర్లు, డీజీఎం, జీఎంలపై ఉన్నాయి.


ఈవార్తను కూడా చదవండి: Hyderabad: అవిశ్వాసంపై మాట్లాడొద్దు..

ఈవార్తను కూడా చదవండి: Khairatabad: అమెరికాలో రోడ్డు ప్రమాదం హైదరాబాద్‌ వాసి మృతి

ఈవార్తను కూడా చదవండి: ఆ రోజు నుంచే ప్రభుత్వ పథకాల జాతర: భట్టి విక్రమార్క..

ఈవార్తను కూడా చదవండి: High Alert: హై అలర్ట్‌గా తెలంగాణ ఛత్తీస్‌గడ్ సరిహద్దు..

Read Latest Telangana News and National News

Updated Date - Jan 30 , 2025 | 09:59 AM