Tinmar Mallanna: తీన్మార్ మల్లన్నపై సస్పెన్షన్ వేటు..
ABN, Publish Date - Mar 01 , 2025 | 01:07 PM
కాంగ్రెస్ పార్టీ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిచినందుకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రవర్తించడమే కాకుండా బీసీ కుల గణన ప్రతులు చించడంపై ఆ పార్టీ అధిష్టానం సీరియస్ అయింది.
కాంగ్రెస్ పార్టీ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిచినందుకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రవర్తించడమే కాకుండా బీసీ కుల గణన ప్రతులు చించడంపై ఆ పార్టీ అధిష్టానం సీరియస్ అయింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ మల్లన్నకు ఫిబ్రవరి 5 న షోకాజ్ నోటీస్ జారీ చేశారు.
12 వ తేది లోపు వివరణ ఇవ్వాలని కోరినా.. మల్లన్న నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. పార్టీ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిచినందుకు మల్లన్నను సస్పెండ్ చేస్తున్నట్లు చిన్నారెడ్డి తెలిపారు. టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ మాట్లాడుతూ పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదన్నారు. మల్లన్నను ఎన్నో సార్లు హెచ్చరించినా మార్పు రాలేదన్నారు. బీసీ కుల గణన ప్రతులు చించడంపై ఏఐసీసీ సీరియస్ అయిందన్నారు. మల్లన్న చేసిన వాఖ్యలు చాల తప్పు అని ఆయన పేర్కొన్నారు.
Updated Date - Mar 01 , 2025 | 01:19 PM