Miss World 2025: మే 15న పోచంపల్లికి అందాల భామలు
ABN, Publish Date - Apr 17 , 2025 | 04:52 AM
మిస్ వరల్డ్ 2025 పోటీ కోసం వచ్చే అందాల భామలు మే 15న యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లిని సందర్శించనున్నారు. చేనేతకు గుర్తింపు కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను టూరిజం శాఖ చేపట్టింది.
చేనేతకు విశిష్ఠ గుర్తింపు తెచ్చే ప్రణాళికలు
టూరిజం శాఖ డైరెక్టర్ స్మిత సబర్వాల్
భూదాన్‌పోచంపల్లి, హైదరాబాద్, ఏపిల్ర్ 16 (ఆంధ్రజ్యోతి): వచ్చేనెల 15న అందాల భామలు యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లికి రానున్నారు. హైదరాబాద్‌లో మే 7 నుంచి 31 వరకు మిస్ వరల్డ్-2025 పోటీలను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహంచనున్న సంగతి తెలిసిందే. ఈ పోటీల్లో పాల్గొనే అందాల భామలకు భూదాన్‌పోచంపల్లి రూరల్ టూరిజం సెంటర్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు ఇక్కడ చేస్తున్న ఏర్పాట్లను టూరిజం శాఖ డైరెక్టర్ స్మిత సబర్వాల్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చేనేత విశిష్ఠత, ప్రతిష్ఠ పెంచేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. తెలంగాణ సాంస్కృతిక వస్త్రాలను, చేనేత వారసత్వాన్ని ప్రపంచ ప్రేక్షకులకు ప్రదర్శించడానికి మే 15న చేనేత ఐకానిక్ పోచంపల్లిలో మిస్ వరల్డ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. భూదాన్‌పోచంపల్లికి 35 దేశాలకు చెందిన విదేశీ ప్రతినిధులు వస్తారని స్మితా సబర్వాల్ తెలిపారు. చేనేత కార్మికులు ఉత్పత్తి చేస్తున్న పట్టు చీరల కేంద్రాన్ని, మగ్గాలను ఆమె ఈ సందర్భంగా పరిశీలించారు.
ఇవి కూడా చదవండి...
Rahul Gandhi: రెండు రకాల గుర్రాలు.. గుజరాత్‌లో కాంగ్రెస్ వ్యూహంపై రాహుల్
BR Gavai: తదుపరి సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్
Ranya Rao Gold Smuggling Case: బళ్లారి నగల వ్యాపారి బెయిలు తిరస్కరణ
Ramdev: రామ్‌దేవ్ 'షర్‌బత్ జిహాద్' వ్యాఖ్యలపై దిగ్విజయ్ కేసు
Updated Date - Apr 17 , 2025 | 04:53 AM