ఖర్గేను కలిసిన మంత్రి వివేక్ దంపతులు
ABN, Publish Date - Jun 09 , 2025 | 11:00 PM
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను సోమవారం రాష్ట్ర మంత్రి వివేక్ వెంకట స్వామి కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఆయన నివాసంలో మర్యాదపూ ర్వ కంగా కలిశారు.
మందమర్రి టౌన్, జూన్ 9(ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను సోమవారం రాష్ట్ర మంత్రి వివేక్ వెంకట స్వామి కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఆయన నివాసంలో మర్యాదపూ ర్వ కంగా కలిశారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా కలిసి శాలువాతో సత్కరించారు. స్వీట్లు తినిపించారు. ఆయనతో పాటు ఆయన తనయుడు, ఎంపీ గడ్డం వంశీకృష్ణ కూడా ఉన్నారు. అదే విధంగా అక్కడ నుంచి నేరుగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌ను కూ డా ఆయన నివాసంలో కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
Updated Date - Jun 09 , 2025 | 11:00 PM